BREAKING
లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో సైబర్ నేరాలపై చందానగర్ పోలీసుల అవగాహన నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ మూవీ: రెమ్యూనరేషన్‌పై టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అంజయ్య నగర్ గుల్షన్ నగర్‌లో నూతన డ్రైనేజీ పైప్‌లైన్ పనులు ప్రారంభం శ్రీరాముడి పాత్ర దక్కడం నా అదృష్టం: ఐదు వేల ఏళ్ల కిందటే భారత్‌లో ఎగిరే వాహనాలు ఉన్నాయన్న రణ్‌బీర్ కపూర్ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి.. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయొద్దు: డీఎస్పీ కాజల్ జైస్వాల్ ఘనంగా ఏఐటీయూసీ 107వ జయంతి వేడుకలు...... కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాలి: నాయకుల పిలుపు నానక్‌రాంగూడలో ఘనంగా దర్గా నియాజ్ పాల్గొన్న మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్: నవంబర్ 1న రామ్‌చరణ్, సుకుమార్ ‘RC 17’ గ్రాండ్ లాంచ్ షారుఖ్ ఖాన్ 'కింగ్' సినిమా నుంచి తప్పుకున్న అనిరుధ్ రవిచందర్: కారణమేంటంటే? టూ మచ్ ఫన్, యాక్షన్ తో సూర్య 'సీన్' ట్రైలర్ రిలీజ్: నవంబర్ 6న భారీ కానుకగా రాబోతున్న చిత్రం రూపశ్రీ కౌంటీ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ కల్ట్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు: నవంబర్ 3న వినోదాల జాతర సమ్మర్ హాలిడేస్ సినిమా చూస్తూ మీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటారు: నిర్మాత ధీరజ్ మొగిలినేని *నూతన సుగుణ చికెన్ సెంటర్ ప్రారంభించిన మున్సిపల్ వైస్ చేర్మెన్ దారం శంకర్* బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ఎన్ఎంఆర్ డివిజన్ ఇన్‌చార్జి రవి ముదిరాజ్ లక్ష్యం!

రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం: గోలి మధుసూదన్ రెడ్డి

Select Suryaa Now
రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం:  గోలి మధుసూదన్ రెడ్డి


కట్టంగూర్ మేజర్ న్యూస్ 
బీజేపీ జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి
తహసీల్దార్ కార్యాలయం ఎదుట బిజెపి ధర్నా

వర్షాభావ పరిస్థితులతో తీవ్రంగా నష్టపోయిన కట్టంగూర్ మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించి, రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ కట్టంగూర్ మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా  నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షులు నీలం నాగరాజు గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కట్టంగూరు మండలంలో వర్షాలు లేక పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు, తాగునీరు అందక రైతాంగం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహ రించడం శోచనీయమన్నారు. ప్రభుత్వం కాలయాపన చేయకుండా తక్షణమే కట్టంగూర్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, ఎండిపోయిన పంటలకు ఎకరాకు తగిన పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై బీజేపీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. ఈధర్నాలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నకరకంటి మొగులయ్య, రాష్ట్ర దివ్యాంగుల విభాగం కోకన్వీనర్ గోలి ప్రభాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న, కార్యదర్శి పబ్బు వెంకటేశ్వర్లు గౌడ్, మండల ఇన్చార్జి శివకృష్ణ, జిల్లా నాయకులు నూకల సుధాకర్ రెడ్డి, కొరివి శంకర్, చీనేని జాని, ఓబీసీ మోర్చా కార్యదర్శి కోమటి నరసింహ, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పాదూరు వెంకట్ రెడ్డి, నాయకులు పులకరం శంకర్, కోమటి భాస్కర్, ముడుసు బిక్షపతి, ఓరుగంటి హరిబాబు, బొడ్డుపల్లి ఆంజనేయులు, మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు గోలి మహేశ్వరి, కార్యదర్శి శ్రీరామ సంధ్య వీరేష్, జిల్లా యువమోర్చా నాయకులు బత్తిని నాగరాజు, గున్నాల నాగరాజు, కారంపూడి సాయికుమార్, మండల ఉపాధ్యక్షులు చేరుకు నాగరాజు, జడగల వీరస్వామి, పాలోజు జలేంద్ర చారి, బొడ్డుపల్లి శ్రీధర్, యువమోర్చా మండల అధ్యక్షులు దండు భానుప్రసాద్, బూత్ అధ్యక్షులు బొడ్డుపల్లి కోటేష్, బీజేపీ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.