రాయికోడ్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
రాయికోడ్, సూర్య మేజర్ న్యూస్ మండల కేంద్రమైన రాయికోడ్ తో పాటు పలు గ్రామాలలో ఆదివారం నాడు సద్దుల
బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు, మహిళలు వారివారి ఇళ్లల్లో గునుక పువ్వు,తంగేడు పువ్వు, రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మను మరియు పసుపుతో గౌరమ్మను చేసి పూజాకార్యక్రమం నిర్వహించి బతుకమ్మలను అన్నింటినీ ఒక్కచోట ఉంచి '' బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో,రామ రామ ఉయ్యాలో " వంటి తదితర పాటలకు మహిళలు చప్పట్లతో,కోలాటాలతో ఆడి
ఊరి శివారులో ఉన్న వాగులో బతుకమ్మలను నిమజ్జనం చేయడం జరిగింది