ప్రజావాణికి ఒక దరఖాస్తు
సూర్య రాజంపేట రాజంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 15 మంది మండల స్థాయి అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖకు సంబంధించి ఒక దరఖాస్తు అందగా, సమస్య పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు పంపించినట్లు ఎంపీడీవో బి. సూర్యాజీ తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ పూర్ణచందర్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.