BREAKING
ఐపీఎల్ 2027: కోచ్‌గా మారిన స్టార్ స్పిన్నర్ అమిత్ మిశ్రా, ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం! అనివార్య కారణాలతో ప్రవీణ్ అరోర రథయాత్ర వాయిదా భారతీయ సినిమాకు బాలీవుడ్ అందించిన చరిత్రాత్మక సేవలు: మూలాలు మొదలు ఆధునిక మార్పుల వరకు! గిద్ద పెరుమాండ్ల టెంపుల్‌లో జమ్మి పూజలో పాల్గొన్న ఆకుల నరసన్న పటేల్ 32వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి గా బట్టే వెంకట కీర్తి వైరల్ కావడమే నేటి యువత పరమావధిగా మారిందా: సోషల్ మీడియా ట్రెండ్స్ వెనుక ఉన్న చేదు నిజాలు! ఓటీటీల హవా ప్రభావం: చిన్న సినిమాలకు సువర్ణావకాశమా లేక థియేటర్లకు పెను ముప్పు ? ప్రజాసేవే లక్ష్యంగా..... ఒక్క అవకాశం ఇవ్వండి 31 వ డివిజన్ లో అభివృద్ధి చేసి చూపిస్తాం... జనసేన కార్పొరేటర్ అభ్యర్థి మందపాటి భానుప్రియ బాలీవుడ్‌లో కలకలం రేపిన కాల్పుల ఘటన: టైగర్ ష్రాఫ్ కారుపై దాడితో అప్రమత్తమైన స్టార్లు దాసరి యాకోబు మృతి పార్టీకి తీరనిలోటు......... పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఫుట్‌పాత్ లేదు.. రక్షణ కరవు: ట్రాఫిక్ మధ్యే స్కూటర్‌పై వెళ్తున్న ఈటన్‌విల్లే దివ్యాంగుడు.. విస్తరణ పనుల వేళ తప్పని అవస్థలు! ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ది రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 3 ట్రైలర్ విడుదల: మరింత భీకరంగా సౌరాన్ ప్రయాణం! ఆరెంజ్ కౌంటీ టీచర్ల కాంట్రాక్ట్ వివాదం: స్కూల్ బోర్డు కీలక సమావేశం వాయిదా.. హెల్త్ ఇన్సూరెన్స్ అంశంపై పీటముడి! బిగ్‌బాస్ హౌస్‌లో ఓటింగ్ ట్రెండ్ సంచలనం: రోహిత్ గ్రాఫ్ పతనం, డబుల్ ఎలిమినేషన్‌పై ఊహాగానాలు! వాతావరణ మార్పుల పోరులో ప్రపంచానికి ఎదురుదెబ్బ: అమెరికా విధానాలే ప్రధాన కారణమంటూ యూఎన్ సంచలన నివేదిక!

పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి ... సంస్మరణ దినోత్సవంలో కలెక్టర్, సీ.పీ

Select Suryaa Now
పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి ...  సంస్మరణ దినోత్సవంలో కలెక్టర్, సీ.పీ
సూర్య నిజామాబాద్ జిల్లా ప్రతినిధి : శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహరహం శ్రమిస్తూ అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, సమాజం ఎల్లవేళలా వారికి రుణపడి ఉంటుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. విధి నిర్వహణలో భాగంగా సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ, అమరులైన పోలీసులను స్మరించుకోవడం, వారి కుటుంబాల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని గుర్తు చేశారు. పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో కలిసి పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.      ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణ విధుల్లో పోలీసులు అనునిత్యం నిమగ్నం అయి ఉంటారని అన్నారు. ఈ క్రమంలో ఎదురయ్యే అనేక సవాళ్లను తమ ప్రాణాలను పణంగా పెట్టీ ధైర్యంగా ఎదుర్కొంటారని అన్నారు. ఈ నేపథ్యంలోనే గత సంవత్సరం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అసాంఘిక శక్తుల చేతిలో ప్రమోద్ కుమార్ అనే సీసీఎస్ కానిస్టేబుల్ వీర మరణం పొందారని ఆవేదన వ్యక్తం చేశారు. ముంబైలో తీవ్రవాదులు దాడి చేసిన సమయంలో వారిని ఎదుర్కొనేందుకు కానిస్టేబుల్ తుకారాం చూపిన ధైర్య సాహసాలు అనన్య సామాన్యమని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పోలీసులు కేవలం శాంతి భద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా తప్పిపోయిన చిన్నారుల ఆచూకీ కనుగొని వారిని తల్లిదండ్రుల చెంతకు చేర్చడం, మహిళకు భద్రత కల్పించడం, అన్ని వర్గాల వారికి భరోసాగా నిలవడం వంటి విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. పోలీసు అమరుల కుటుంబాలకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఇందులో భాగంగానే కారుణ్య నియామకాల ప్రక్రియను వేగవంతం చేస్తామని అన్నారు.       పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య మాట్లాడుతూ, ఈ ఏడాది దేశవ్యాప్తంగా 154 మంది పోలీసులు అమరులయ్యారని అన్నారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 1986 నుండి ఇప్పటివరకు 21 మంది పోలీసులు అసాంఘిక శక్తులతో పోరాడుతూ అసువులు బాశారని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా తమ కర్తవ్య నిర్వహణలో ఎల్లవేళలా పోలీసులు ముందంజలో నిలుస్తున్నారని అన్నారు. అమరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లవేళలా చేదోడువాదోడుగా ఉంటుందని భరోసా కల్పించారు. ఇప్పటికే 11 మందికి ఇంటి స్థలాలు కేటాయించడం జరిగిందని, మిగతా పది కుటుంబాలకు వారు కోరిన మేరకు కామారెడ్డి, మాక్లుర్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో స్థలాలు కేటాయించేలా రెవెన్యూ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. అమరులైన పోలీసుల ప్రతి కుటుంబానికి స్థలం లభించే వరకు పట్టుదలతో పర్యవేక్షిస్తామని అన్నారు. అమరుల కుటుంబాలు తమ సాధకబాధకాలు తెలియజేసేందుకు వరుసలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక అధికారిని నియమిస్తామని తెలిపారు. అంతేకాకుండా స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు అమరుల కుటుంబాలను స్వయంగా కలిసి వారి అవసరాలను గుర్తిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో విధి నిర్వహణలో అమరులైన పోలీసుల కుటుంబీకులకు జ్ఞాపికలు అందజేశారు.     ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ శుభం నగ్రాలే, ఏ.సి.పి (ఎ.ఆర్) కృష్ణ, నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ , సిసిఎస్ , ట్రాఫిక్, సి.టి.సి ఏసీపీలు , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ , సీఐలు, ఎస్.ఐలు , పోలీసు సిబ్బంది , అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.