పానగల్ ఛాయా సోమేశ్వరాలయం అభివృద్ధికి రూ. 20 కోట్లు మంజూరు...
-- మంత్రి కోమటిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన.... నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి.
#.పానగల్ ను ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతా.. నల్గొండ జిల్లా బ్యూరో, మేజర్ న్యూస్...
నల్గొండ జిల్లా కేంద్ర సమీపంలోని చారిత్రాత్మక పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయం, పరిసర ప్రాంతాల సమగ్ర సుందరీకరణ, అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది.ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో పానగల్ లోని శ్రీ చాయ సోమేశ్వర స్వామి దేవాలయం,పరిసర ప్రాంతాలు, సమీపంలోని జల వనరులను సమగ్రంగా అభివృద్ధి చేసి సుందరీకరించాలని ప్రతిపాదించారు.
ఈ విషయాన్ని పరిశీలించిన ప్రభుత్వం ఎట్టకేలకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కు రూ.20 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చింది.
ఈ నిధులను ఉపయోగించి పానగల్ లోని శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం దాని పరిసర ప్రాంతాలు సమీపంలోని జన వనరుల సమగ్ర సుందరీ కరణ అభివృద్ధి పనులను చేపట్టనుంది.
అదేవిధంగా దేవాలయాలను ప్రముఖ వారసత్వ ఆధ్యాత్మిక పర్యావరణ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనుంది.
*. చరిత్రకు సజీవ సాక్ష్యం పానగల్ దేవాలయాలు------
పానగల్ లోని పచ్చల, ఛాయా సోమేశ్వర దేవాలయాలు చరిత్రకు సజీవ సాక్ష్యమని నగర మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
పానగల్‌లోని చారిత్రాత్మక శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం, పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.20 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఆలయ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఆలయ పరిసరాల సుందరీకరణ, పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడనున్నాయని పేర్కొన్నారు.
చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన పానగల్ ప్రాంతాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం దోహద పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.చారిత్రక ఆలయాల పరిరక్షణతో పాటు పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ఆమె పేర్కొన్నారు.
పానగల్ ప్రాంత అభివృద్ధికి ఈ నిధుల మంజూరు కీలక ముందడుగుగా నిలుస్తుందని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.