నూతన సీఐకు కౌన్సిలర్ల ఘన సన్మానం*
*చౌటుప్పల్, మేజర్ న్యూస్:* చౌటుప్పల్ నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన దేవిరెడ్డి సతీష్‌రెడ్డిని పురపాలిక 1వ వార్డు కౌన్సిలర్ కోసనం రాకేష్‌రెడ్డి, 19వ వార్డు కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్,బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడంలో పోలీసు శాఖకు తమ సహకారం ఉంటుందని కౌన్సిలర్లు తెలిపారు.