నేటి జడ్చర్లలో జరిగే బ్రాహ్మణ శంఖారావానికి తరలిరావాలి
*నారాయణపేట, సూర్యన్యూస్* : సనాతన ధర్మ పరిరక్షణ కొరకు , వైదిక సాంప్రదాయాల పరిరక్షణకు ,బ్రాహ్మణ సమాజ ఐక్యతకు వేదికగా ఆదివారం జడ్చర్లలోని వాసవి కల్యాణ మండపంలో విరాట్ రూపంలో జరిగే ఉమ్మడి పాలమూరు జిల్లా బ్రాహ్మణ శంఖారావం కార్యక్రమానికి మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తద్వారా బ్రాహ్మణ మహిళా శక్తిని చాటాలని పేట జిల్లా బ్రాహ్మణ సంఘం మహిళా నాయకురాలు యాద్గీర్ మంగళ విజయాచారి కోరారు. బ్రాహ్మణ వీరనారీమణి ఝాన్సీబాయి లాంటి మహనీయ మహిళల స్ఫూర్తితో బ్రాహ్మణ మహిళలు అత్యధిక సంఖ్యలో ఇట్టి శంఖారావం కార్యక్రమానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు. కేవలం ఇంటి పనులు చక్కబెట్టడం వరకే మహిళ బాధ్యత తీరిపోదనే బ్రాహ్మణ సంస్కృతీ సాంప్రదాయాలను చక్కబెట్టి భావితరాలకు వారసత్వ సంపదగా అందించే గురుతర బాధ్యత కూడా బ్రాహ్మణ మహిళలపై ఉందని అభిప్రాయపడ్డారు. సమావేశంలో సంఘం నాయకులు భళ్ళారి విద్యా , వసంత కొప్రేషాచారి , సంగ్వార్ భాను గోపీనాథ్ రావ్ , పట్వారి జ్యోత్స్న , కులకర్ణి మేఘన తదితరులు పాల్గొన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట.