మహాలక్ష్మి దేవికి మహిళల కుంకుమార్చన
చౌటుప్పల్, మేజర్ న్యూస్:మండలంలోని పంతంగి గ్రామంలో జై భవాని యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమార్చన పూజలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అమ్మవారి కృపతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు. కార్యక్రమంలో జై భవాని యూత్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.