BREAKING
అమ్మవారి చీర వేలంపాటలో రూ.2 లక్షలకు దక్కించుకున్న శీలం శివారెడ్డి అరిజోనాను వణికించిన అరుదైన పెనుతుపాను: గోల్ఫ్ బంతి పరిమాణంలో వడగళ్ల వర్షం.. తీవ్ర ఆస్తి నష్టం! మిచిగాన్ సెనేట్ చివరి డిబేట్‌లో మాటల యుద్ధం: దేశభక్తి, విధేయతలపై ఎల్-సయ్యద్, మైక్ రోజర్స్ పరస్పర ఆరోపణలు! ఒరెగాన్ స్కూల్ కాల్పుల ఘటన: 'పిల్లలను కాపాడే అవకాశమే లేకపోయింది'.. గాయపడిన ఉపాధ్యాయురాలి భావోద్వేగ ప్రకటన! అంచనాలను మించిన మెటా క్యూ3 ఆదాయం: 'మ్యూజ్' ఖాతాలు కోటి దాటాయన్న మార్క్ జుకర్‌బర్గ్.. ఏఐ వ్యూహం సూపర్ హిట్! ఎన్నికల నిర్వహణపై రాష్ట్రాల హక్కుల పరిరక్షణ: ట్రంప్ యంత్రాంగంపై డెమొక్రాట్ల దావా.. కోర్టులో సవాల్! వాషింగ్టన్ డీసీలో నేషనల్ గార్డ్ కాల్పుల ఘటన: నిందితుడిపై తుపాకీ చట్టాల కింద బహుళ అభియోగాలు నమోదు! ఫ్లోరిడా అమెండ్‌మెంట్ 3పై ‘న్యూస్ 6’ ప్రత్యేక చర్చా వేదిక: ఆస్తి పన్నుల్లో భారీ మినహాయింపులు.. భక్తులకు అసౌకర్యం కలగకుండా పైడితల్లి అమ్మవారి దర్శనం. టెస్లా సరికొత్త ఎగిరే కారుకు ఫ్లోరిడాలో అనుమతిస్తాం: గవర్నర్ రాన్ డిసాంటిస్ సంచలన ప్రకటన! ఫ్లోరిడా వాహనదారులకు అందుబాటులోకి సరికొత్త లైసెన్స్ ప్లేట్: రష్యా జైలు నుంచి అమెరికన్ స్టీఫెన్ హబ్బర్డ్ విడుదల: 'నమ్మలేకపోతున్నాడు'.. భావోద్వేగానికి గురైన సోదరి! హైతీలో గ్యాంగ్‌ల చెరలో నలుగురు సైనికులు: రంగంలోకి దిగిన బుకేలే సైన్యం.. బందీల రక్షణకు భారీ ఆపరేషన్! కొలంబియాలో ‘కమ్యూనిస్ట్ ఆర్ట్’ వివాదం: నేషనల్ మ్యూజియం నుంచి కళారూపాల తొలగింపు.. భగ్గుమన్న నిరసనలు! పసిఫిక్ మహాసముద్రంలో బలపడిన ‘వాన్స్’ తుపాను: తీరప్రాంతాలకు వర్ష సూచన.. అప్రమత్తమైన వాతావరణ కేంద్రం!

-గ్రామంలో కొత్త సంప్రదాయానికి శ్రీకారం -గ్రామ సర్పంచ్ కుంచం లత

Select Suryaa Now
-గ్రామంలో కొత్త సంప్రదాయానికి శ్రీకారం  -గ్రామ సర్పంచ్ కుంచం లత

సిద్దిపేట రూరల్, : విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని పుల్లూరు గ్రామంలో తొలిసారిగా రావణ దహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.సర్పంచ్ కుంచం లత వెంకట్, ఉపసర్పంచ్ ఒగ్గు రాజేష్ ఆధ్వర్యంలో పాలకవర్గం సమన్వయంతో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో తొలిసారిగా రావణ దహన కార్యక్రమం చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగానిలిచిందన్నారు.చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పండుగ సందర్భంగా రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించడం గ్రామస్థుల్లో ఉత్సాహాన్ని నింపిందన్నారు. ఈ వేడుకలతో పుల్లూరు గ్రామంలో పండుగ శోభ సంతరించుకుంది. గ్రామస్థులు ఈ కార్యక్రమంలో భాగస్వాములై విజయదశమి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారని తెలిపారు.

కొత్త సంప్రదాయానికి శ్రీకారం

పుల్లూరు గ్రామంలో తొలిసారిగా రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించడం అలాగే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని రథ శోభాయాత్ర ద్వారా గ్రామంలో కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. పండుగలు కేవలం వేడుకలకే పరిమితం కాకుండా ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం, ఆత్మీయతను పెంపొందించేలా ఉండాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం చాటిచెప్పింది. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని గ్రామస్థులు అభిప్రాయపడ్డారన్నారు.

సర్పంచ్, పాలకవర్గంపై హర్షం

గ్రామ అభివృద్ధితో పాటు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రాధాన్యతనిస్తూ రావణ దహన కార్యక్రమాన్ని చేపట్టడంపై సర్పంచ్ కుంచం లత వెంకట్, ఉపసర్పంచ్ ఒగ్గు రాజేష్, పాలకవర్గంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలందరినీ ఒకచోట చేర్చి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. పుల్లూరులో తొలిసారిగా నిర్వహించిన రావణ దహన కార్యక్రమం విజయదశమి వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో పాటు గ్రామంలో పండుగ సందడిని మరింత పెంచింది.