బాచేపల్లిలో మూడు ప్రారంభోత్సవాలు ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి
నిజాంపేట్, : నిజాంపేట్ మండలంలోని బాచేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం, సమైక్య భవనం, వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవాలు ఘనంగా జరిగాయి.నారాయణఖేడ్ శాసనసభ్యులు పట్లోళ్ల సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ మూడు కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూఛత్రపతి శివాజీ మహారాజ్ మన దేశం కోసం ఎన్నో యుద్ధాలు చేసి ఎనలేని సేవలు అందించారు. ఆయన ధైర్యం, పరిపాలన నేటి యువతకు ఆదర్శం. ఆయన స్ఫూర్తితోనే మనం ముందుకు సాగాలిసమైక్య భవనం ద్వారా గ్రామంలోని మహిళా సంఘాల స్త్రీలు తమ సంక్షేమ పథకాల గురించి, తమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఇక్కడే చర్చించుకుని ముందుకు సాగేందుకు ఈ భవనం ఎంతో ఉపయోగపడుతుంది"కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన ఉంది. వరి కొనుగోలు కేంద్రం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, వారి పంటకు సరైన మద్దతు ధర అందించడమే మా లక్ష్యం అని అన్నారు మరి సిసి రోడ్డు స్వీట్ లైట్లు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పత్తి గారి లక్ష్మి అంజయ్య, ఉప సర్పంచ్ పెంటయ్య మండల అధ్యక్షుడు లింగారెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు శంకర్ గౌడ్ శ్రీను ప్రవీణ్ గౌడ్ సుదర్శన్ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు మహిళా సంఘాల సభ్యులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.