డ్రైనేజీ సమస్య పరిష్కరించిన కాంగ్రెస్ నాయకులు
మల్కాజిగిరి, మేజర్ న్యూస్ : మౌలాలి 186వ డివిజన్ పరిధిలోని చందాబాగ్ కాలనీలో గత కొన్ని రోజులుగా డ్రైనేజీ మ్యాన్‌హోల్ నుంచి మురుగునీరు పొంగి పొర్లుతూ రోడ్లపై ప్రవహించడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. ఈ సమస్యను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ మౌలాలి డివిజన్ అధ్యక్షుడు పోతుల వినోద్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్ ఆధ్వ ర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులం దరూ కలిసి తమ సొంత నిధులతో డ్రైనేజీ మరమ్మతు పనులను పూర్తి చేయించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లా డుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి తమ శాయశక్తులా పని చేస్తామన్నారు. ప్రజలకు తమ కాలనీలలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మౌలాలి డివిజన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్ర టరీ సలీం, సీనియర్ నాయకులు రైసుద్ధీన్, గున్నాల అరుణ్ గౌడ్, హమీద్, ఫారూక్, చంద్రకాంత్, నర్సింగరావు, రమేష్, అక్తర్, మల్లేష్, మైనారిటీ ప్రెసిడెంట్ షకీల్, కుమార్, సాయి తదితరులు పాల్గొన్నారు.