BREAKING
ఎంపీటీసీ నామినేషన్ల వేళ పోలీసు ఆంక్షలు. రొంపిచెర్ల మండల ప్రజలు సహకరించాలి సీతారాంబాగ్ రామ్‌ మైదానంలో ఉద్రిక్తత.. మదనపల్లి అభివృద్ధికై డాక్టర్ అప్సర్ షరీఫ్ ని గెలిపించండ : డిసిసి అధ్యక్షులు గాజుల భాస్కర్ పిలుపు బీరప్ప స్వామి ఆలయంలో వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ప్రత్యేక పూజలు కురుబ కులస్తుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు.. రమేష్ గౌడ్‌కు ఘన సన్మానం వాహన, ఆయుధ పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే అమర్ అంజన్నకు సీఎం ప్రత్యేక పూజలు వైభవంగా శ్రీవారి చక్రస్నానం ప్రధాని నివాసం సమీపంలోని చారిత్రక రేస్ కోర్స్ మసీదుకు ఎవిక్షన్ నోటీసు: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు జోక్యాన్ని కోరిన అసదుద్దీన్ ఒవైసీ! చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా.. డాక్టర్ గడల శ్రీనివాసరావు కస్టడీ పొడిగింపుపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా: ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఉత్తర్వుల సవాలు! గుజరాత్‌లో నాలుగు ఘోర రోడ్డు ప్రమాదాలు: విధుల్లో ఉన్న పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ సహా 11 మంది దుర్మరణం! గ్రేటర్ నోయిడాలో 19వ రెన్యూవబుల్ ఎనర్జీ ఇండియా ఎక్స్‌పో: 1,080 మంది ఎగ్జిబిటర్లతో స్వచ్ఛ ఇంధన సాంకేతికతల ప్రదర్శన! ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణతో కాంగ్రెస్ బెంబేలు: బీజేపీ నేత శ్రీకాంత్ శర్మ తీవ్ర వ్యాఖ్యలు! పలమనేరు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 33 వార్డుల్లో పోటీ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో మరో కీలక ఘట్టం: 5వ యూనిట్ ట్రయల్ రన్ విజయవంతం

ధరణి, భూ భారతి చర్చకు ప్రభుత్వం భయపడింది

Select Suryaa Now
ధరణి, భూ భారతి చర్చకు ప్రభుత్వం భయపడింది

సూర్య ప్రతినిధి, హైదరాబాద్ :ధరణి, భూ భారతి పోర్టల్స్‌పై శాసనసభలో చర్చించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భయపడి పారిపోయిందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ధరణి పోర్టల్‌లో జరిగిన అక్రమాలపై నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని, అందులో జరిగిన అవినీతిపై ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందం వల్లే ఈ అక్రమాలపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

ధరణి, భూ భారతిలలో చోటుచేసుకున్న అక్రమాలు, భూ కుంభకోణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని ఏలేటి డిమాండ్ చేశారు. అలాగే 22A (నిషేధిత భూముల) జాబితాలో అన్యాయంగా చేర్చిన ప్రైవేటు భూములను వెంటనే తొలగించి, బాధితులకు విముక్తి కలిగించాలని కోరారు. ధరణి, భూ భారతి అక్రమాల వెనుక ఉన్న సూత్రధారుల అసలు రంగు బయటపడే వరకు తమ పోరాటం ఆగేది లేదని మహేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు.