BREAKING
తిరుమల శ్రీవారి సన్నిధిలో తాండూరు పట్లోళ్ల కుటుంబం.. భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకున్న దీప నర్సింలు ఎమ్మెల్యే అమిలినేనికి బోరంపల్లి రైతులు ఘన సన్మానం. వ్యవసాయ విద్యుత్ సరఫరాపై TGSPDCL సీఎండీ ఆకస్మిక తనిఖీలు చర్చ్ కాలనీలో పేలుడు.. వ్యక్తికి తీవ్ర గాయాలు! ఆటోల్లో ప్రమాదకర ప్రయాణం! పియు లో సౌత్ జోన్ ఎంపికలు చిన్న శ్రీను, సిరమ్మ సమక్షంలో టీడీపీలో చేరిన 600కు పైగా కుటుంబాలు చాపిరి చెరువుకు కృష్ణా జలాలు.. రైతుల హృదయాల్లో అమిలినేనికి ప్రత్యేక స్థానం రైతుల సంక్షేమానికి ఎమ్మెల్యే అమిలినేని చేస్తున్న కృషి అభినందనీయం ఘనంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు బోరంపల్లి రైతుల సన్మానం భోగాపురం విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత! పూలు పండ్లు అమ్మే వ్యాపారస్తుల వద్దకు వెళ్లి ఓటును అభ్యర్థించిన మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి బుట్నా లక్ష్మి. ప్రజల నమ్మకాన్ని నిలుపుకుంటాం.. కదిరి వైసిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి అత్తర్ పర్వీన్ యేసుప్రభు ఆశీర్వాదం పొందిన వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ బియ్యం అక్రమార్కులపై సీఐడీ ఉక్కుపాదం.. పలు జిల్లాల్లో దాడులు! యాక్షన్ కింగ్ అర్జున్ రెండో కుమార్తె అంజనా వివాహం.. విదేశీయుడితో గ్రాండ్‌గా వెడ్డింగ్! నాని ‘ది ప్యారడైజ్’ మూవీపై ఘట్టమనేని గౌతమ్ రివ్యూ.. సూపర్ స్టార్ వారసుడి ప్రశంసలు!

మల్లాపూర్లో డీలా పడ్డ గులాబీ

Select Suryaa Now
మల్లాపూర్లో డీలా పడ్డ గులాబీ


 

 
 
 
 
సూర్య మల్లాపూర్:
 
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి రోజురోజుకీ డీలా పడుతుందని చర్చ జోరుగా సాగుతోంది. గతంలో కదం తొక్కిన పార్టీ ఇప్పుడు కార్యకర్తలకు దూరమవుతోందని సొంత కేడరే ఆవేదన వ్యక్తం చేస్తోంది. మండలంలో పార్టీ కార్యక్రమాలు నామమాత్రంగా మారాయని, ప్రజా సమస్యలపై నాయకత్వం స్పందించడం లేదని కింది స్థాయి నాయకులు అంటున్నారు. ప్రస్తుత నాయకత్వం వల్ల పార్టీ బలహీనపడుతోందని యువకులకు, సీనియర్లకు సమన్వయం కుదిర్చే కొత్త నాయకుడు వస్తేనే పార్టీకి పూర్వ వైభవం వస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు. ఏళ్ల తరబడి ఒక్కరే మండల నాయకత్వం వహించడంతో కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని కార్యక్రమాలు కూడా అనుకున్న స్థాయికి చేరుకోలేదని చర్చలు కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ మండల కేంద్రానికి చెందిన నాయకులు స్పందించి ఫిర్యాదు చేయడం. మండల నాయకత్వం వహించే నాయకుడు బాధ్యత వహించకపోవడంతో పార్టీని కాపాడుకోవాలంటే నాయకత్వ మార్పు అనివార్యమని శ్రేణులు బహిరంగంగానే చెబుతున్నాయి. పార్టీ లో విభేదాలు తలెత్తకుండా ఏకతాటిపై కార్యకర్తలు నడవడానికి అధిష్టానం‌ ఎ విధమైన చర్యలు తీసుకుంటుందోనని బిఆర్ఎస్ నాయకులు ఎదురు చూస్తున్నారు.