BREAKING
శిల్పారామంలో అలరించిన భరతనాట్య ప్రదర్శన లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో సైబర్ నేరాలపై చందానగర్ పోలీసుల అవగాహన నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ మూవీ: రెమ్యూనరేషన్‌పై టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అంజయ్య నగర్ గుల్షన్ నగర్‌లో నూతన డ్రైనేజీ పైప్‌లైన్ పనులు ప్రారంభం శ్రీరాముడి పాత్ర దక్కడం నా అదృష్టం: ఐదు వేల ఏళ్ల కిందటే భారత్‌లో ఎగిరే వాహనాలు ఉన్నాయన్న రణ్‌బీర్ కపూర్ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి.. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయొద్దు: డీఎస్పీ కాజల్ జైస్వాల్ ఘనంగా ఏఐటీయూసీ 107వ జయంతి వేడుకలు...... కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాలి: నాయకుల పిలుపు నానక్‌రాంగూడలో ఘనంగా దర్గా నియాజ్ పాల్గొన్న మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్: నవంబర్ 1న రామ్‌చరణ్, సుకుమార్ ‘RC 17’ గ్రాండ్ లాంచ్ షారుఖ్ ఖాన్ 'కింగ్' సినిమా నుంచి తప్పుకున్న అనిరుధ్ రవిచందర్: కారణమేంటంటే? టూ మచ్ ఫన్, యాక్షన్ తో సూర్య 'సీన్' ట్రైలర్ రిలీజ్: నవంబర్ 6న భారీ కానుకగా రాబోతున్న చిత్రం రూపశ్రీ కౌంటీ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ కల్ట్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు: నవంబర్ 3న వినోదాల జాతర సమ్మర్ హాలిడేస్ సినిమా చూస్తూ మీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటారు: నిర్మాత ధీరజ్ మొగిలినేని *నూతన సుగుణ చికెన్ సెంటర్ ప్రారంభించిన మున్సిపల్ వైస్ చేర్మెన్ దారం శంకర్*

భూ భారతి రీ సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ హైమావతి

Select Suryaa Now
భూ భారతి రీ సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ హైమావతి

సిద్దిపేట, ; రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి – రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులకు సూచించారు. శనివారం చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామంలో కొనసాగుతున్న భూ భారతి రీ సర్వే పనులను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రామునిపట్ల గ్రామం సుమారు 1,120 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, జీపీఓ, సర్వేయర్, రెవెన్యూ అధికారులు అధునాతన రోవర్ యంత్రం సహాయంతో ప్రతిరోజూ 35 నుంచి 40 ఎకరాల వరకు సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుమారు వందేళ్ల క్రితం భూముల సర్వే జరిగిందని, ప్రస్తుతం భూములకు సంబంధించి నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు ప్రభుత్వం రీ సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని వివరించారు.రీ సర్వేలో ముందుగా ప్రభుత్వ స్థలాలు, నక్షా బాటలు, చెరువులు, కుంటలు తదితర ప్రభుత్వ భూములను పూర్తిస్థాయిలో కొలిచిన అనంతరం పట్టా భూముల సర్వే చేపడతామని స్పష్టం చేశారు. పట్టా భూముల సర్వే చేపట్టే తేదీని రైతులు, భూ యజమానులకు కనీసం రెండు రోజుల ముందుగానే తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.

సర్వే సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి

భూముల రీ సర్వే జరిగే సమయంలో భూ యజమానులు తప్పనిసరిగా హాజరై కొలతలను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. సర్వేలో ఏవైనా సందేహాలు, అభ్యంతరాలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని, అవసరమైతే మరోసారి సర్వే చేయించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. సమస్యలు పరిష్కారం కాకపోతే స్థానిక తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాలని, వచ్చిన ఫిర్యాదులను 60 రోజుల్లోపు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.రైతులు తమకు ఇతర పనులు ఉన్నప్పటికీ సర్వే జరిగే సమయంలో ప్రాధాన్యతనిచ్చి హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. భూ హద్దుల సమస్యలు, సర్వే నంబర్లలో గందరగోళం వంటి సమస్యలు ఉన్నప్పుడు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయకుండా, సర్వే సిబ్బందికి సహకరించాలని కోరారు. భవిష్యత్తులో భూ వివాదాలకు తావులేకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ తమ భూముల కొలతలను సక్రమంగా నమోదు చేయించుకోవాలని సూచించారు.

జిల్లాలో అన్ని రెవెన్యూ గ్రామాల్లో రీ సర్వే

జిల్లాలో మొదటి విడతలో 73 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేశామని, రెండో విడతలో ఇప్పటివరకు 30 గ్రామాల్లో సర్వే నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో దశలవారీగా రీ సర్వే ప్రక్రియ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి రైతులు, భూ యజమానులు, గ్రామ ప్రజాప్రతినిధులు అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సలీం, గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి, ఉప సర్పంచ్ బైటి శంకర్, సర్వే అధికారులు, గ్రామ ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.