BREAKING
ప్రధాని నివాసం సమీపంలోని చారిత్రక రేస్ కోర్స్ మసీదుకు ఎవిక్షన్ నోటీసు: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు జోక్యాన్ని కోరిన అసదుద్దీన్ ఒవైసీ! చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా.. డాక్టర్ గడల శ్రీనివాసరావు కస్టడీ పొడిగింపుపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా: ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఉత్తర్వుల సవాలు! గుజరాత్‌లో నాలుగు ఘోర రోడ్డు ప్రమాదాలు: విధుల్లో ఉన్న పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ సహా 11 మంది దుర్మరణం! గ్రేటర్ నోయిడాలో 19వ రెన్యూవబుల్ ఎనర్జీ ఇండియా ఎక్స్‌పో: 1,080 మంది ఎగ్జిబిటర్లతో స్వచ్ఛ ఇంధన సాంకేతికతల ప్రదర్శన! ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణతో కాంగ్రెస్ బెంబేలు: బీజేపీ నేత శ్రీకాంత్ శర్మ తీవ్ర వ్యాఖ్యలు! పలమనేరు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 33 వార్డుల్లో పోటీ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో మరో కీలక ఘట్టం: 5వ యూనిట్ ట్రయల్ రన్ విజయవంతం వెల్దుర్తి మండల అభివృద్ధికి సుబ్బారాయుడు కుటుంబం కృషి అభినందనీయం ముంబైలోని చారిత్రక గేట్‌వే ఆఫ్ ఇండియాను సందర్శించిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో: 26/11 అమరులకు నివాళి! శ్రీకాకుళం బీచ్‌లో తీవ్ర విషాదం: స్నానానికి వెళ్ళి నలుగురు గల్లంతు కృష్ణానదిలో వైభవంగా దుర్గమ్మ తెప్పోత్సవం: హంస వాహనంపై భక్తులకు అభయమిచ్చిన దుర్గామల్లేశ్వరులు 34వ డివిజన్‌లో సరిపూటి రమణ ప్రచార హోరు.. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థన.. బైరాగి గూడా లో ఘనంగా దసరా వేడుకలు దుర్గామాత సేవలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి

అదుపుతప్పిన ద్విచక్ర వాహనం.

Select Suryaa Now
అదుపుతప్పిన ద్విచక్ర వాహనం.

సూర్య శ్రీరాంపూర్: మండలంలోని పందిల్ల గ్రామంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో ఇద్దరు యువకులు గాయపడిన ఘటన ఆదివారం రోజున చోటు చేసుకుంది. వీణవంక మండలం కల్లుపల్లి గ్రామానికి చెందిన రాహుల్, రహీం ఇద్దరు గాయపడ్డారు. కాల్వ శ్రీరాంపూర్ ఎస్సై గట్ల సుధాకర్ గాయపడిన వారిని ప్రభుత్వ దవాఖానకు తరలించి ప్రథమ చికిత్స అందించి తన మానవతా హృదయాన్ని చాటిచెప్పారు. వివరాల్లోకి వెళితే సద్దుల బతుకమ్మ సందర్భంగా ఎస్సై గట్ల సుధాకర్ పర్యవేక్షణ కొరకు అటువైపు వెళుతుండగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి గాయపడిన యువకులు సహాయం కోసం ఎదురుచూస్తుండగా వారిని గమనించిన ఆయన తన స్థాయి, హోదాను మరచిపోయి సొంత వాహనంలో హుటాహుటిన ప్రభుత్వ దవాఖానకు తరలించి ప్రథమ చికిత్స చేయించడాన్నీ స్థానికులు ప్రశంసిస్తున్నారు. ఖాకీ దుస్తుల వెనుక  కట్టిన హృదయము ఉంటుందనేది ఎంత నిజమో సమయాన్ని బట్టి సాయం కొరకు ఎదురుచూసే వారి పట్ల స్పందించే మానవతా హృదయం కూడా ఉంటుందని తన చర్యల ద్వారా చాటి చెప్పారు. ఇలాంటి చర్యల ద్వారా పోలీసులపై ఉన్న భయం పోయి సమాజంలో నమ్మకం పెరుగుతుందని ఎస్ఐ గట్ల సుధాకర్ ను మండల ప్రజలు అభినందిస్తున్నారు.