ఉట్లపల్లిలో పోషక మాంసం కార్యక్రమం
*ఉట్లపల్లిలో పోషక మాంసం కార్యక్రమం*
అశ్వరావుపేట ప్రాజెక్టు పరిధిలోని జమ్మిగూడెం సెక్టార్ కు చెందిన ఉట్లపల్లి గ్రామంలో శుక్రవారం పోషక మాంసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. పోషక విలువలు అధికంగా ఉండే ఆహారాన్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల తల్లి, శిశువు ఆరోగ్యంగా ఉంటారని వివరించారు. గర్భిణులు, బాలింతలు అంగన్వాడి కేంద్రాల ద్వారా అందించే పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్థానికంగా లభించే పౌష్టికాహార పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనివ్వవచ్చు అని తెలిపారు. అనంతరం గర్భిణులకు సాంప్రదాయ బద్ధంగా శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించి అంగన్వాడి అధికారులు సిబ్బంది ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మికుమారి, ఐసిఎస్ సిడిపిఓ ముత్తమ్మ, సెక్టార్ సూపర్వైజర్ వరలక్ష్మి, అంగన్వాడీ టీచర్స్ ఉషారాణి, మంగ, కేదారేశ్వరి, సెక్టార్ అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.
సూర్య ప్రతినిధి మునీర్ అశ్వరావుపేట