ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ..
ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ..
బెజ్జంకి,మేజర్ :ఉపాధి హామీ పనుల్లో ఎలాంటి లోపాలకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సామజిక తనిఖీ అధికారి సురేందర్ పేర్కొన్నారు.మండల పరిధిలోని దాచారం గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద 2025-26 కాలానికి చేపట్టిన ఉపాధి హామీ పనులపై బుధవారం అయన సామజిక తనిఖీ కార్యక్రమం నిర్వహించారు.అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపాధి పనులు,ఖర్చు,నిధులపై ఎస్ఏఓ సురేందర్ వివరాలు తెలిపారు.అనంతరం సర్పంచ్ బైర మానస మాట్లాడారు.ఉపాధి హామీ పథకం కూలీలకు ఏ విధంగా చేయూతనిస్తుందో తెలియజేశారు.అలాగే గ్రామంలో చేపట్టనున్న అభివృద్ధి పనులపై పంచాయతీ పాలక వర్గ సభ్యులతో సమావేశము ఏర్పాటు చేసి ప్రణాళిక రూపొందించి ముందుకు వెళ్తామని సర్పంచ్ బైర మానస పేర్కొన్నారు.ఉప సర్పంచ్ బాలనర్సు,కార్యదర్శి సురేష్,టీఏ మాధవి,వార్డు సభ్యులు రాజు,అశోక్,కవిత,పీఏసీఎస్ డైరెక్టర్ బైర సంతోష్ తదితరులు పాల్గొన్నారు.