తాలుకా ఎస్సీ సెల్ చైర్మన్ గా జాంగారి రవి....
షాద్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం షాద్‌నగర్‌లో జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ సీనియర్ నేత బాధేపల్లి సిద్ధార్థ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి తాలూకా సమన్వయ కమిటీ కన్వీనర్ పి. రఘునాయక్, మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు రాయికల్ శ్రీనివాస్, కోగురి పురుషోత్తం రెడ్డి, జాకారం చంద్రశేఖర్, అన్మగళ్ల రమేష్, కుమారస్వామి గౌడ్, ఏళ్లారం శేఖర్ రెడ్డి, టౌన్ అధ్యక్షుడు నల్లమోని శ్రీధర్, జాండగూడెం సుదర్శన్ గౌడ్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎస్సీ సెల్ తాలూకా మాజీ అధ్యక్షుడు కరోళ్ల సురేందర్, ఎస్సీ సెల్ నాయకుడు జాంగారి రవి పేరును తాలూకా అధ్యక్ష పదవికి ప్రతిపాదించారు. ఆరు మండలాలకు చెందిన ఎస్సీ సెల్ నాయకులు జాంగారి రవికి మద్దతు ప్రకటించడంతో, ఏకాభిప్రాయంతో ఫరూఖ్‌నగర్ మండలం వెల్‌జర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు జాంగారి రవి షాద్‌నగర్ తాలూకా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. అదేవిధంగా నియోజకవర్గంలోని మండలాల ఎస్సీ సెల్ అధ్యక్షులను ప్రకటించారు. ఫరూఖ్‌నగర్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా చిన్నచినొల్ల శివకుమార్ (బూర్గుల), కేశంపేట్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా గోపని భీమయ్య (కాకునూర్), కొత్తూర్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా పెంటనోళ్ల ఆంజనేయులు (ఇన్ముల్‌నర్వ), కొందుర్గ్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా మల్లని యాదయ్య (చెరుకుపల్లి సర్పంచ్), నందిగామ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా గునుగుర్తి రాజశేఖర్ (చేగూర్) ఎంపికయ్యారు. చౌదరి గూడ, షాద్‌నగర్ టౌన్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ కమిటీలను మూడు రోజుల్లో ఏర్పాటు చేస్తామని నూతన తాలూకా అధ్యక్షుడు జాంగారి రవి తెలిపారు. షాద్‌నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగాన్ని మరింత పటిష్ఠంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకం ఉంచి చిన్న వయసులోనే తాలూకా ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఎస్సీ విభాగం జిల్లా చైర్మన్ శ్రీధర్, తాలూకా సమన్వయ కమిటీ కన్వీనర్, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ మండల, బ్లాక్ అధ్యక్షులు, సింగిల్ విండో చైర్మెన్ లకు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎస్సీ విభాగం నాయకులు, మాజీ మండల అధ్యక్షులు, కార్యకర్తలకు జాంగారి రవి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోగురి పురుషోత్తం రెడ్డి, రాయికల్ శ్రీనివాస్, జాకారం చంద్రశేఖర్, టౌన్ అధ్యక్షుడు నల్లమోని శ్రీధర్, ఎస్సీ సెల్ సీనియర్ నేత బాధేపల్లి సిద్ధార్థ, తాలూకా మాజీ అధ్యక్షుడు కరోళ్ల సురేందర్, పెంజర్ల గ్రామ సర్పంచ్ ఎరోళ్ల జగన్, అప్పారెడ్డిగూడ గ్రామ సర్పంచ్ చిన్నంతగారి మల్లేష్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు శివకుమార్, గోపని భీమయ్య, మల్లని యాదయ్య, గునుగుర్తి రాజశేఖర్, పెంటనోళ్ల ఆంజనేయులు, ఎస్సీ సెల్ టౌన్ మాజీ అధ్యక్షుడు సింగాపాగ అనిల్‌కుమార్, కరోళ్ల యాదయ్య, జాంగారి జంగయ్య, నల్ల నర్సింహులు, గడ్డం జంగయ్య, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గుండె రాణి, అప్పారెడ్డిగూడ కృష్ణ తదితర ఎస్సీ సెల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
జవ్వాజి రాఘవేంధర్ గౌడ్, మేజర్ న్యూస్ షాద్ నగర్