BREAKING
ఆటోమొబైల్ రంగానికి సౌతాఫ్రికా ప్రభుత్వం షాక్ ఎన్నికల ఇన్చార్జి రామకృష్ణ కు స్వాగతం పలికిన రామరాజు,నాయుడు 'ఈ ఫీల్డ్‌కు నేను సరిపోనేమో'.. వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ ఆనంది కళ్యాణదుర్గం పురపోరు.. ఇక సమరమే...… చైర్‌పర్సన్‌ పీఠంపై టీడీపీ, వైకాపా గురి బరిలో పల్లవి, దొడగట్ట హర్షిణి అభ్యర్థుల ఖరారుతో వేడెక్కిన రాజకీయం.. గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీల వ్యూహాలు...… డిసెంబర్ 4న నాగ చైతన్య 'వృషకర్మ' గ్రాండ్ రిలీజ్.. ఇంటెన్స్ లుక్‌తో సరికొత్త పోస్టర్ విడుదల కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. పాల్గొన్న కలెక్టర్ దీపక్ తివారి కర్చల్ గ్రామంలో నూతన పెన్షన్ల వెరిఫికేషన్ -జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి పరిశీలన పాప్స్ (PAPSS) చెల్లింపుల వ్యవస్థలో చేరిన ఇథియోపియా సెంట్రల్ బ్యాంక్ జనయేత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డా. ఏపీజే అబ్దుల్ కలాం జయంతి* శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తో జనసేన పార్టీ నేత మిద్దెల హరి భేటీ డాలర్ దాటికి ఆఫ్రికా దేశాల కరెన్సీల తడబాటు 'కరికాల' నా కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుంది.. వైభవంగా సందీప్ కిషన్ కొత్త చిత్రం ప్రారంభోత్సవం ప్రపంచానికి డీజిల్ ఎందుకు అంత అత్యవసరం? గ్లోబల్ మార్కెట్లో తీవ్ర కొరతకు గల కారణాలు.. తెరపైకి భారత రిఫైనరీల కీలక పాత్ర! *మధిర HP Gas agency లో విజిలెన్స్ అవగాహన కార్యక్రమం* 'జైలర్ 2' సినిమాపై హీరో ధనుష్ ప్రశంసల జల్లు.. సూపర్‌స్టార్ రజినీకాంత్ మ్యాజిక్ రిపీట్

సిఎంఆర్ డెలివరీ సకాలంలో పూర్తి చేయాలి • జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు

Select Suryaa Now
సిఎంఆర్ డెలివరీ సకాలంలో పూర్తి చేయాలి  • జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు

 

 

సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి : జిల్లాలోని రైస్ మిల్లుల యజమానులు సిఎంఆర్ డెలివరీ సకాలంలో పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఛాంబర్ లో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వేణుగోపాల్, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీకళ లతో కలిసి సిఎంఆర్ డెలివరీ పై అధికారులు, రైస్ మిల్లుల యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సిఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) బియ్యం డెలివరీలలో వెనుకబడిన మిల్లులు తమ పని తీరును మెరుగుపరుచుకొని, బియ్యం అప్పగింతలను వేగవంతం చేయాలని తెలిపారు. కొన్ని మిల్లులు నిర్దేశిత లక్ష్యాల సాధనలో జాప్యం చేస్తున్నాయని, పెండింగ్ లో ఉన్న సిఎంఆర్ బియ్యం డెలివరీలను తక్షణమే వేగవంతం చేసి, ప్రభుత్వం నిర్దేశించిన కార్యాచరణ ప్రకారం గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. సిఎంఆర్ బియ్యం లక్ష్యాల సాధనలో ఆలస్యం జరగకుండా మిల్లర్లు తగిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. ఈ సమావేశంలో రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.