BREAKING
ఇది బండి కాదు మొండి..!మళ్లీ మొరాయించిన ఆర్టీసీ బస్సు ప్రకృతి వ్యవసాయం రాష్ట్రానికే ఆదర్శవంతం. ఎంపీడీవో ఉషారాణి మున్సిపల్, పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష మంత్రి అనగానీి కృషితో 100 పడకల వైద్యశాలకు నిధులు మంజూరు కారుణ్య నియామకం కోసం ఐదేళ్లుగా నిరీక్షణ రజినీకాంత్ జైలర్ 2 రన్‌టైమ్ లాక్.. మొదటి పార్ట్ కంటే తక్కువ సమయంతో సెన్సార్ పూర్తి! ప్రధాని మోదీ 25 ఏళ్ల పాలన ప్రస్థానానికి నీరాజనం పోషణ మాసోత్సవాలు అంగన్వాడీ ఉత్సవం ఘనంగా ముగింపు వర్షానికి కూలిన అంగన్వాడి భవనం గోడ.. ముగిసిన కాంగ్రెస్ యువ క్రాంతి బునియాది శిక్షణ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి:కాశవారిగూడెం సర్పంచ్ బొల్లం రమేష్ యాదవ్ ఆక్రమణకు గురైన స్మశాన భూమి స్వాధీనం నాణ్యమైన శిక్షణతోనే మెరుగైన ఉపాధి శిక్షణ సర్టిఫికెట్‌కే పరిమితం కాకూడదు సీడాప్ ఆధ్వర్యంలో ఘనంగా డీడీయూజీకేవై 2.0 వర్క్ షాప్ కోడిపందాల స్థావరంపై దాడి : నిందితులు అరెస్ట్ --ఎస్సై జె చంద్రశేఖర్ వెల్లడి మాజీ మంత్రి హరీశ్‌రావును మర్యాదపూర్వకంగా కలిసిన కర్నాటి వజ్రమ్మ వెంకటేశం దంపతులు

సీఎంపీఎఫ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Select Suryaa Now
సీఎంపీఎఫ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి
సూర్య-గోదావరిఖని:సింగరేణి సంస్థలో పనిచేస్తున్న శాశ్వత, కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగులు, రిటైర్డ్ కార్మికులకు సంబంధించిన సీఎంపీఎఫ్‌ (కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్) సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని సీఎంపీఎఫ్ కార్యాలయం ఎదుట కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. అనంతరం సీఎంపీఎఫ్ కమిషనర్ గోవర్ధన్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ.. శాశ్వత కార్మికులు, ఉద్యోగులకు గత రెండు ఆర్థిక సంవత్సరాలుగా (2024–25, 2025–26) సీఎంపీఎఫ్ స్లిప్పులు అందకపోవడంతో తమ ఖాతాల్లోని నిల్వలపై స్పష్టత లేకుండా పోయిందన్నారు. తక్షణమే పెండింగ్ స్లిప్పులను అందించాలని డిమాండ్ చేశారు. వివిధ అవసరాల కోసం కార్మికులు దరఖాస్తు చేసుకున్న సీఎంపీఎఫ్ రుణాలు కూడా నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే మంజూరు చేయాలని కోరారు. కాంట్రాక్టు కార్మికులకు సైతం గత రెండు సంవత్సరాలుగా సీఎంపీఎఫ్ స్లిప్పులు అందడం లేదని, వారి ఖాతాల వివరాలు తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. వారికి కూడా స్లిప్పులను వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ కార్మికులకు పలుమాసాలుగా పెన్షన్లు మంజూరు కాక ఇబ్బందులు ఎదురవుతున్నాయని సీతారామయ్య తెలిపారు. పెన్షన్‌దారుల మరణానంతరం అర్హులైన కుటుంబ సభ్యులు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ నెలల తరబడి మంజూరు కాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అర్హులైన కుటుంబ సభ్యులకు పెన్షన్లు త్వరితగతిన మంజూరు చేయాలని కోరారు.
--------------
సీ-కేర్ యాప్‌పై ఫిర్యాదులు
 
సీఎంపీఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీ-కేర్ యాప్ సక్రమంగా పనిచేయడం లేదని, ఖాతాల వివరాలు సకాలంలో అప్‌డేట్ కాక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. యాప్ వినియోగంపై అవగాహన లేని కార్మికులకు తగిన సహాయం అందించాలని కోరారు. అలాగే రిటైర్డ్ కార్మికులు, ఉద్యోగులకు రివైజ్డ్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (ఆర్‌పీపీఓ) కాపీలు అందకపోవడం వల్ల పెన్షన్ సంబంధిత ప్రక్రియల్లో జాప్యం జరుగుతోందని అన్నారు. కార్మికుల సీఎంపీఎఫ్ సమస్యలను ఇకపై పెండింగ్‌లో ఉంచకుండా యుద్ధప్రాతిపదికన పరిష్కరించేందుకు సీఎంపీఎఫ్ కమిషనర్, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శులు మడ్డి ఎల్లయ్య, కందికట్ల వీరభద్రం, కేంద్ర కార్యదర్శులు కవ్వంపల్లి స్వామి, కందుకూరి రాజారత్నం, బ్రాంచి కార్యదర్శులు బాజి సైద, తిరుపతి, కొట్టే కిషన్‌రావు, అక్బర్ అలీ, రంగు శ్రీను, గందం సాంబశివరావు, ఎం.ఆర్.సి.రెడ్డి, బుర్ర తిరుపతి, ఎం.ఎ.గౌస్‌తో పాటు శ్రీరాంపూర్, గోలేటి, రామగుండం రీజియన్‌లకు చెందిన ఆఫీస్ బేరర్లు, పిట్ కార్యదర్శులు, మైన్స్ సేఫ్టీ కమిటీ సభ్యులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.