సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
సూర్య,మాక్లూర్:మాక్లూర్ మండలం గుంజీలి గ్రామానికి చెందిన గణమొల్ల ఒడ్డెమ్మకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.27 వేల చెక్కును ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు మాక్లూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బి. దయాకర్ రావు ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డి, వినయ్ కుమార్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు పాల్దా హరీష్, డాక్టర్ గంగన్న, చామంతుల శ్రీనివాస్, సలీం, నవీన్, ఇస్మాయిల్, జనార్దన్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.