సలుగుపల్లి మూలమలుపు వద్ద బొలెరో బోల్తా!
సూర్య బెజ్జుర్:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం సలుగుపల్లి పల్లె ప్రకృతి వనం సమీపంలోని మూలమలుపు వద్ద బొలెరో వాహనం అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు తెలిపారు. - హెచ్చరిక బోర్డులు లేక ప్రమాదాల భయం! డబ్బా–బెజ్జూర్ ప్రధాన రహదారిలోని ప్రమాదకరమైన మూలమలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ప్రమాదకరమైన మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.