BREAKING
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి.. అధిష్ఠానంతో కీలక భేటీలు! తూర్పు ఐరోపా ఆర్థిక అద్భుతం పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు భారత్‌లో ప్రాసెస్డ్ ఫుడ్ ప్యాకింగ్ నిబంధనలలో బిగ్ ఛేంజ్ జర్మనీ భద్రతా సంస్థలకు కొత్త సవాళ్లు అమెరికా చైనా మధ్య వాణిజ్య సయోధ్య: రాయితీ సుంకాలతో వ్యవసాయ ఉత్పత్తులు, వైద్య పరికరాల ఎగుమతి ఇండోనేషియా స్టాక్ ఎక్స్ఛేంజ్ సంచలన నిర్ణయం లుపిన్ ఫార్మాకు యూఎస్ ఎఫ్‌డీఏ కీలక ఆమోదం: ఎపిక్సాబాన్ ఓరల్ సస్పెన్షన్‌కు లభించిన గ్రీన్ సిగ్నల్ కేదార్‌నాథ్ మార్గంలో విరిగిపడిన కొండచరియలు ఐరోపా ఆర్థిక మార్కెట్ల ముందు వింటర్ సవాళ్లు ఎల్‌పీయూలో విద్యార్థుల తీవ్ర ఆందోళనలు అమెరికాలో సౌదీ విదేశాంగ మంత్రి పర్యటన టాటా గ్రూప్ వివాదంతో జర్మనీ డ్యుయిష్ బ్యాంక్‌కు చిక్కులు ట్రంప్-షి జిన్‌పింగ్ శీఖరాగ్ర సమావేశం అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై పన్నులు తగ్గించిన చైనా

రెడ్ క్రాస్ పాలకమండలి ఏకగ్రీవం

Select Suryaa Now
రెడ్ క్రాస్ పాలకమండలి ఏకగ్రీవం

*రెడ్ క్రాస్ పాలకమండలి ఏకగ్రీవం*

---రెడ్ క్రాస్ ఎన్నికల్లో 15 మంది ఏకగ్రీవం
---నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

హనుమకొండ, సెప్టెంబర్ 27 (మేజర్ న్యూస్ సూర్య)
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ శాఖ నూతన మేనేజింగ్ కమిటీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా శనివారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది.మొత్తం 19 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, 4 గురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో మిగిలిన 15 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎలక్షన్ ఆబ్జర్వర్, ఇంచార్జ్ అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) బి. శేషాద్రి, ఎన్నికల అధికారి బి. నరసింహ కుమార్ ప్రకటించారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మేనేజింగ్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం 7 గంటలకు స్థానిక హనుమకొండలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భవన్ లో నిర్వహించారు.ఏకగ్రీవంగా ఎన్నికైన మేనేజింగ్ కమిటీ సభ్యులు గొట్టిముక్కల శ్రీలక్ష్మి, ఈ.వి. శ్రీనివాస్ రావు, పెద్ది వెంకట నారాయణ రెడ్డి, డా. యస్. జ్యోతి, డా. నల్ల సురేందర్ రెడ్డి, బాశెట్టి హరిప్రసాద్, బొమ్మినేని పాపి రెడ్డి, కొక్కిరాల రాకేష్, డా. పెసరు విజయచందర్ రెడ్డి, డా. కె. సుధాకర్ రెడ్డి, మాటేటి నీలవతి, పిట్ట రఘునాథ్ రెడ్డి, డా. సిహెచ్ . సంధ్యారాణి, బొల్లూరి వేణుగోపాల్, పొన్నాల సంయుక్త.

అనంతరం నూతన మేనేజింగ్ కమిటీ సభ్యుల తమలో నుంచి చైర్మన్ గా డా. పెసరు విజయచందర్ రెడ్డి, వైస్ చైర్మన్ గా పెద్ది వెంకట్ నారాయణ రెడ్డి, రాష్ట్ర పాలక మండలి సభ్యుడిగా ఈ.వి. శ్రీనివాస్ రావు, కోశాధికారిగా బి. పాపి రెడ్డిలను ఎన్నుకున్నారు.

ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా మేనేజింగ్ కమిటీ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం నూతన పాలకవర్గ సభ్యులను రెడ్ క్రాస్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించాలని పలువురు ఆకాంక్షించారు.