ప్రమాదకరంగా జియో టవర్: అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలి
అడవిదేవులపల్లి మేజర్ న్యూస్
అడవిదేవులపల్లి:
అడవిదేవులపల్లి మండల కేంద్రంలో నెలకొల్పిన జియో సెల్ టవర్ ప్రస్తుతం స్థానిక ప్రజలకు తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. టవర్ నిర్వహణ లోపించడం వల్ల దాని చుట్టూ, నిర్మాణ భాగాలపై పిచ్చి మొక్కలు, తీగలు విపరీతంగా అల్లుకుపోయాయి. దీనివల్ల టవర్ ప్రమాదకరస్థాయికి చేరిందని, ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందేమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
టవర్ చుట్టూ పిచ్చి పొదలు పెరగడం, తీగలు అల్లుకోవడం వల్ల విద్యుత్ వైర్లకు అంతరాయం కలగడంతో పాటు, పురుగులు, పాములు చేరే ప్రమాదం ఉందన స్థానికులు తెలిపారు. అలాగే గాలులు, తుఫానుల సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వారు వాపోతున్నారు.
సంబంధిత జియో సంస్థ ప్రతినిధులు మరియు అధికారులు వెంటనే స్పందించి, టవర్‌ను శుభ్రం చేయించి, తగిన మరమ్మత్తులు చేపట్టాలని మండల ప్రజలు, స్థానికులు
సిద శ్రీను.
గొడుగు శేఖర్
గువ్వల వెంకటేశ్వర్లు.
కోటి
కోరుతున్నారు.