పొద్దున్నే పీకలదాకా మద్యం తాగి.... ప్రమాదంలో మృతి
షాద్ నగర్
*పొద్దున్నే పీకలదాకా సేవించి..*
*షాద్నగర్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం..*
*ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు*
*వేగంగా దూసుకొచ్చిన కారు రెండు బైకులను ఢీకొట్టి పల్టీలు..*
*చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన వాహనం*
*కర్మ రిటర్న్ ఎలా ఉంటుందో చూశారా.. అయితే ఈ వార్త చదవండి*
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ శివారులోని పరిగి రోడ్డులో గ్రానైట్ కంపెనీ సమీపంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రెండు బైకులను ఢీకొట్టి పల్టీలు కొడుతూ చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైకులపై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు.
స్థానికుల సమాచారం ప్రకారం.. కారు డ్రైవర్ ఉదయం మద్యం సేవించి వేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపాడు. సదరు వాహనంలో సైతం మద్యం బాటిల్ దర్శనమిచ్చింది. సర్దార్నగర్ వద్ద కక్కునూరు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్న బైక్ను కారు ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు.
అనంతరం అదే కారు షాద్నగర్ వైపు దూసుకొచ్చి పట్టణ శివారులో మరో బైక్ను ఢీకొట్టింది. ఈ క్రమంలో కారు అదుపుతప్పి పల్టీలు కొడుతూ రోడ్డుపక్కన ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్లి ఆగిపోయింది. ప్రమాద తీవ్రతను చూసి ప్రత్యక్ష సాక్షులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మరో బైక్పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని సైతం ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదానికి మద్యం సేవించి వాహనం నడపడం, అతివేగం కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, మృతుడి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి. పట్టణ శివారులో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
*కర్మ రిటర్న్..*
సర్దార్ నగర్ వద్ద కక్కునూరు గ్రామానికి చెందిన ఇద్దరిని ఢీ కొట్టి తీవ్ర గాయాల పాలు చేసిన సదరు కారు డ్రైవర్ షాద్ నగర్ వద్ద కూడా మరో బైకును ఢీకొట్టాడు. ఇక్కడ అతను చావు బతుకుల మధ్య ఉండగా 108 అంబులెన్స్ కోసం కాల్ చేశారు. అప్పటికే సర్దార్ నగర్ లో జరిగిన సంఘటనలో గాయపడి క్షతగాత్రులను తీసుకువచ్చేందుకు అంబులెన్స్ అక్కడికి వెళ్లింది. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తులను బైకులను ఢీకొన్న కారు డ్రైవర్ అక్కడే ఉన్నప్పటికీ వారిని ముందుగా ఆసుపత్రికి చేర్చే క్రమంలో అంబులెన్స్ ముందుకు సాగింది. కర్మ అంటే ఇదేనేమో..? అతడు చేసిన పనికి అతడికి అంబులెన్స్ కరువైంది. చేసిన పనికి తగిన మూల్యం చెల్లించుకోగా అతని ప్రాణాలు అక్కడికక్కడే కోల్పోయాడు. కర్మ రిటర్న్స్ అంటే ఇదేనేమో..?
జవాజి రాఘవేందర్ గౌడ్: మేజర్ న్యూస్