BREAKING
ఇది బండి కాదు మొండి..!మళ్లీ మొరాయించిన ఆర్టీసీ బస్సు ప్రకృతి వ్యవసాయం రాష్ట్రానికే ఆదర్శవంతం. ఎంపీడీవో ఉషారాణి మున్సిపల్, పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష మంత్రి అనగానీి కృషితో 100 పడకల వైద్యశాలకు నిధులు మంజూరు కారుణ్య నియామకం కోసం ఐదేళ్లుగా నిరీక్షణ రజినీకాంత్ జైలర్ 2 రన్‌టైమ్ లాక్.. మొదటి పార్ట్ కంటే తక్కువ సమయంతో సెన్సార్ పూర్తి! ప్రధాని మోదీ 25 ఏళ్ల పాలన ప్రస్థానానికి నీరాజనం పోషణ మాసోత్సవాలు అంగన్వాడీ ఉత్సవం ఘనంగా ముగింపు వర్షానికి కూలిన అంగన్వాడి భవనం గోడ.. ముగిసిన కాంగ్రెస్ యువ క్రాంతి బునియాది శిక్షణ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి:కాశవారిగూడెం సర్పంచ్ బొల్లం రమేష్ యాదవ్ ఆక్రమణకు గురైన స్మశాన భూమి స్వాధీనం నాణ్యమైన శిక్షణతోనే మెరుగైన ఉపాధి శిక్షణ సర్టిఫికెట్‌కే పరిమితం కాకూడదు సీడాప్ ఆధ్వర్యంలో ఘనంగా డీడీయూజీకేవై 2.0 వర్క్ షాప్ కోడిపందాల స్థావరంపై దాడి : నిందితులు అరెస్ట్ --ఎస్సై జె చంద్రశేఖర్ వెల్లడి మాజీ మంత్రి హరీశ్‌రావును మర్యాదపూర్వకంగా కలిసిన కర్నాటి వజ్రమ్మ వెంకటేశం దంపతులు

ఓటు చోరీ పై సమాధానం చెప్పాలి...

Select Suryaa Now
ఓటు చోరీ పై సమాధానం చెప్పాలి...
సూర్య మెట్‌పల్లి:ఓటు చోరీకి సంబంధించిన ఆరోపణలపై బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ సమాధానం చెప్పాలని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఈవీఎంల ద్వారా బీజేపీ అక్రమంగా అధికారంలోకి వచ్చిందని మంత్రి విమర్శించారు.బుధవారం జగిత్యాల జిల్లా మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మించిన వ్యవసాయ మార్కెట్ కార్యాలయ భవనాన్ని వెలమ కార్పొరేషన్ జువ్వాడి నర్సింగరావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఓటు చోరీ ఆరోపణలు ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత ప్రమాదకరమని మంత్రి అన్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలు తలెత్తేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజల ఓటు హక్కుకు ప్రాధాన్యం ఉండాలని, ఓటింగ్ ప్రక్రియపై ప్రజలకు పూర్తి విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల వ్యవస్థపై ఉందన్నారు.నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఓటు చోరీకి పాల్పడిందని, ఈవీఎంల ద్వారా అక్రమంగా అధికారంలోకి వచ్చిందని మంత్రి ఆరోపించారు. ఈ ఆరోపణలపై బీజేపీ నేతలు ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరారు.
...ఎన్నికల సంఘం తీరుపై విమర్శలు...
కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి పక్షపాతంగా వ్యవహరిస్తోందని మంత్రి ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ కనుసైగల్లోనే ఎన్నికల సంఘం పనిచేస్తోందని విమర్శించారు. ఎన్నికల వ్యవస్థపై వస్తున్న సందేహాలకు పారదర్శకంగా సమాధానాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఓటు చోరీ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ, మిత్రపక్షాలతో కలిసి పార్లమెంట్‌లో ప్రస్తావించిందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత సంబంధిత వ్యవస్థలపై ఉందన్నారు.
..కాంగ్రెస్ నేతల అరెస్టును ఖండిస్తున్నాం...
ఓటు చోరీ అంశంపై ప్రశ్నించిన కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయడాన్ని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ విధానాలను, ఎన్నికల ప్రక్రియను ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుందని పేర్కొన్నారు.
బీజేపీ ఎంపీలు వివరణ ఇవ్వాలికాంగ్రెస్ చేస్తున్న ఓటు చోరీ ఆరోపణలపై బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియపై వస్తున్న ఆరోపణలు, సందేహాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
..మోదీ ప్రభుత్వానికి కాలం చెల్లింది..
నరేంద్ర మోదీ ప్రభుత్వానికి కాలం చెల్లిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రజల ఓటు హక్కును కాపాడటం, ఎన్నికల ప్రక్రియపై నమ్మకాన్ని నిలబెట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ డెలిగేట్ మెంబర్ కల్వకుంట్ల సుజిత్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, వైస్ చైర్మన్ తిప్పిరెడ్డి అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకారి నవీన్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నందయ్య, ప్రధాన కార్యదర్శి ఖుతుబొద్దిన్ పాషా, నాయకులు షేక్ మొహమ్మద్, మొఖీమ్, కౌన్సిలర్లు మాసుల ప్రవీణ్, అజీమ్, రెబ్బస్ మహేష్, అజయ్, రమేష్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.