నోములలో 'సేవా సంకల్పం అంగన్ మిలాన్' కార్యక్రమం
నోములలో ‘సేవా సంకల్పం–అంగన్ మిలాన్’ కార్యక్రమం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న నెల రోజుల సేవా కార్యక్రమాల్లో భాగంగా నోముల గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో సిబ్బందికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు యంపాల రాజిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బందిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారులు, పేద కుటుంబాల ఆరోగ్యం, పోషణ, సంక్షేమం కోసం అంగన్‌వాడీ సిబ్బంది అంకితభావంతో సేవలందిస్తున్నారని కొనియాడారు. ప్రజలకు నిత్యం సేవలు అందిస్తున్న వారి సేవలను గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో నోముల ఉప సర్పంచ్ దండేటికార్ దుర్గేష్, ఉపాధ్యక్షులు రాచకొండ సుధాకర్ చారి, దండేటికార్ రవీందర్‌నాథ్, బీజేవైఎం నాయకుడు దండేటికార్ విజయ్, అంగన్‌వాడీ టీచర్ లక్ష్మి, సిబ్బంది సరిత, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఎర్ర లింగం :మేజర్ న్యూస్, మంచాల