నమిలిగొండ లో బి ఆర్ ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు
అక్కిరెడ్డి ఆగారెడ్డి, గాదె రాజు ఆధ్వర్యంలో చేరికలు**
**పార్టీ బలోపేతానికి కృషి చేయాలి ఎమ్మెల్యే పల్లా, మాజీ ఎమ్మెల్యే రాజయ్య**
స్టేషన్‌ఘన్‌పూర్ ప్రతినిధి,
స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నమిలిగొండ గ్రామంలో జిల్లా నాయకులు అక్కిరెడ్డి ఆగారెడ్డి,గాదె రాజు ఆద్వర్యంలో
బీఆర్‌ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. బుధవారం జనగామ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వారికి బీఆర్‌ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
గ్రామ స్థాయిలో బీఆర్‌ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజలతో కలిసి పనిచేయా లని, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం ఉంటుందని అన్నారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు.
బీఆర్‌ఎస్ పార్టీకి గ్రామస్థాయిలో బలమైన కార్యకర్తలే అండగా నిలుస్తు న్నారని అన్నారు. నమిలిగొండలో పలువురు నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరడంతో పార్టీకి మరింత బలం చేకూరుతుందని పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ బీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
బీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో కోటే తిరుపతి, బత్తిని సత్యనారాయణ, బొమ్మెర సంపత్, చిక్కుడు ఎల్లయ్య, పురుమాని రవి, పురుమాని వెంకన్న, డ్యాగల రాజేందర్, కోల వెంకటేష్, సముద్రాల యాకూబ్ పాషా, మినుముల నర్సయ్య, గుండె నరసయ్య, కోలగట్టయ్య, గాద మహేష్, గాదె శివాజీ, తాళ్లపల్లి సాయిలు, గాదె ప్రణయ్, గాదె వంశీధర్ ఉన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మాచర్ల గణేష్, నాయకులు కనకం గణేష్,శీలం శ్యామ్,ఒగ్గురాజు, జబ్బార్,గుండె మల్లేష్, చిట్టిబాబు, గట్టు కృష్ణసాయి తదితరులు పాల్గొన్నారు.