BREAKING
21వ రోజుకు చేరిన వీఆర్ఏ ల సమ్మె 25 ఏళ్ల‌ ప్ర‌జా సేవా శిఖ‌రానికి న‌మో విద్యుత్ సేవా సేతు కార్యక్రమం.. అక్టోబరు 25న నటన, జానపద నృత్య పోటీలు ప్రజలకు ఉచిత విద్యుత్ అందించే దిశగా మరో ముందడుగు మునుగోడు మండల కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక రోడ్డు ప్రమాదం లో గాయపడిన మహిళా చికిత్స పొందుతూ మృతి రూ.3 లక్షలకు నకిలీ బంగారం..! మినీ స్టేడియం నిర్మాణానికి రూ.12 కోట్ల నిధులు మంజూరు కావడంపై యువత, కాంగ్రెస్ నాయకులు హర్షం . సమస్యల పరిష్కరానికి వి ఆర్ ఏ లు చేస్తున్నా దీక్ష కు సి.పి.ఎమ్ సంఘీభావం దోమల నివారణకు గంబూసియా చేపలు... నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. డిసెంబర్‌లో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ లాంఛ్! లింగ నిర్ధారణ చేస్తే క్రిమినల్ కేసులు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల శివాని- మేఘశ్రీ -పార్థసాని చిన్నారులను ఆశీర్వదించిన *డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్* *పవన్ సాయి హాస్పిటల్ అధినేత* చిరు వ్యాపారులకు అండగా కేడీసీసీ బ్యాంక్ పెనుగంచిప్రోలులో 17 మందికి రుణ చెక్కుల పంపిణీ ఎలాంటి షూరిటీ లేకుండా రుణ సదుపాయం కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, కేడీసీసీ చైర్మన్ నెట్టెం రఘురాం హాజరు

క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి ఎస్పీ జగదీష్‌ ఆదహళ్లి

Select Suryaa Now
క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి ఎస్పీ జగదీష్‌ ఆదహళ్లి

నరసరావుపేట మేజర్ న్యూస్ : క్రమశిక్షణతో అంకితభావంతో విధులు నిర్వహించి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్‌ ఆదహళ్లి సూచించారు. వివిధ శిక్షణ కేంద్రాల్లో శిక్షణ పూర్తి చేసుకున్న ఉమ్మడి గుంటూరు రూరల్‌ జిల్లాకు కేటాయించిన 196 మంది పురుష కానిస్టేబుళ్లు బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో రిపోర్ట్‌ చేశారు. ఈ సందర్భంగా వారితో సమావేశమైన ఎస్పీ.. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ చట్ట నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను విధుల్లో సమర్థంగా వినియోగించుకోవాలని, సీనియర్‌ అధికారుల సూచనలు పాటించాలని తెలిపారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయాన్ని ఎస్పీ తనిఖీ చేశారు.

రిపోర్టర్ :మల్లికార్జున్