telanagana
మోదీ గారి 25 ఏళ్ల పాలనా ప్రస్థానం భారత రాజకీయాల్లో నవశకం:
సూర్య నిజామాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యాంగబద్ధ ప్రజాప్రతినిధిగా (ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా) ప్రజాజీవితంలో విజయవంతంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అధ్యక్షతన పాత గంజి ప్రాంగణంలో నిర్వహించిన "వికసిత్ భారత్" సభకు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చారు. సభ అనంతరం పాత గంజి (కిసాన్ గంజి) నుండి శివాజీ చౌక్ (RR చౌరస్తా) వరకు భారీ ‘సేవా జ్యోతి కలశ యాత్ర’ బైక్ ర్యాలీని చేపట్టారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ 25 ఏళ్ల పరిపాలనా ప్రస్థానం భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక నవశకానికి నాంది పలికిందని కొనియాడారు.జీవితంలో ఎన్నడూ బ్యాంకు గుమ్మం తొక్కని కోట్లాది మంది నిరుపేదలకు జన్ ధన్ ఖాతాలు తెరిపించి దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేశారు.కట్టెల పొయ్యి పొగతో అనారోగ్యం బారిన పడుతున్న కోట్లాది మంది పేద తల్లులు, అక్కాచెల్లెళ్లకు 'ఉజ్వల' గ్యాస్ కనెక్షన్లు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు.పీఎం ఆవాస్ యోజన' ద్వారా ప్రతి పేదవాడి సొంతింటి కలను నిజం చేయడంతో పాటు, 'పీఎం కిసాన్ సమ్మాన్ నిధి' ద్వారా నేరుగా అన్నదాతల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జమ చేస్తున్నారు.గతంలో ఉగ్రవాదులు దాడులు చేస్తే శాంతి చర్చల పేరిట కాలయాపన చేసేవారని, కానీ నేడు మోదీ గారి నాయకత్వంలో సరిహద్దులు దాటి సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్‌తో ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టిన బలమైన సైనిక సత్తాను ప్రపంచానికి చాటామని పేర్కొన్నారు..తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, రాష్ట్రంలో ఎటువంటి అవినీతి లేని పారదర్శక డబుల్ ఇంజిన్ పాలన తీసుకురావడానికి ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు.'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్' మంత్రంతో దేశాన్ని ప్రపంచ అగ్రపీఠం వైపు నడిపిస్తున్న మోదీ గారికి సారంగాపూర్ ఆంజనేయ స్వామి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
'సేవా సంకల్ప్ అభియాన్' – 'ఆంగన్ మిలన్ సేవ' కార్యక్రమంలో భాగంగా ఇందూర్ అర్బన్ నియోజకవర్గంలోని అంగన్‌వాడీ టీచర్‌లకు దినేష్ పటేల్ కులాచారి గారు, పల్లె గంగారెడ్డి గారు, మహిళా మోర్చ నాయకులు శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశాం.జాతీయ పసుపు బోర్డు చైర్మన్ శ్రీ పల్లె గంగారెడ్డి గారు మాట్లాడుతూ…ప్రపంచంలోనే ఏ నాయకుడికి సాధ్యం కాని రీతిలో అలుపెరుగని ప్రజాసేవ చేస్తున్న ఏకైక కర్మయోగి నరేంద్ర మోదీ అన్నారు.దీపావళి వంటి పండుగలను సైతం స్వంత కుటుంబంతో కాకుండా దేశ సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుల మధ్య గడుపుతూ, 140 కోట్ల భారతీయుల రక్షణ, క్షేమం కోసం రోజుకు 18 గంటలకు పైగా నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు.ప్రపంచస్థాయి ఎక్స్‌ప్రెస్‌వేలు, అత్యాధునిక అంతర్జాతీయ విమానాశ్రయాలు, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 'వందే భారత్' రైళ్లు నవభారత అభివృద్ధి వేగానికి అద్దం పడుతున్నాయని చెప్పారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రాంతీయ రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల విస్తరణను మోదీ గారు శరవేగంగా పూర్తి చేయిస్తున్నారని కొనియాడారు.2047 నాటికి భారతదేశాన్ని సంపూర్ణ అగ్రరాజ్యంగా మార్చడమే లక్ష్యంగా మోదీ గారు 'వికసిత్ భారత్' వైపు అడుగులు వేయిస్తున్నారని, స్వయం సమృద్ధ, స్వావలంబన కలిగిన దేశ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ యొక్క కార్యక్రమంలో గద్దె భూమన్న, కచ్చెట్టి గంగాధర్ , భారత్ రెడ్డి, నగ్గొల్ల లక్ష్మి నారాయణ, నిమ్మల శ్రీనివాస్, ప్రమోద్ కుమార్, జ్యోతి, న్యాలం రాజు, రాంచందర్, సురేంధర్, బొబ్బిలి వేణు, విజయ్ కృష్ణ, ఓం సింగ్, పిల్లి శ్రీకాంత్, వంశీ గౌడ్, జిల్లా పదాధికారులు, కార్పొరేటర్లు మండల అధ్యక్షులు, బిజేవైయం నాయకులు తదితరులు పాల్గొన్నారు.