మా ఊరు దారిని మేము కాపాడుకుంటాం పొదలాడ ప్రజలు రాస్త రోకో
ఇరగవరం మేజర్ న్యూస్:పొదలాడ గ్రామంనకు వెళ్లే సిమెంట్ రోడ్డు మార్జిన్ లో చాపలు,రొయ్యలు చెరువుల యజమానులు గోడను నిర్మించడానికి ప్రయత్నించినా గ్రామ ప్రజలు వ్యతిరేకిస్తూ బుధవారం రోడ్డుపై రాస్తరోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కామన మునుస్వామి మాట్లాడుతూ పొదలాడ గ్రామస్తులు అనేక పోరాటాలు చేసి సిమెంట్ రోడ్డును నిర్మించుకున్నారని అయినా ఆ రోడ్డుకు ఇరువైపులా మార్జిన్లో కంకరు వెయ్యకపోవడం వలన వాహనాలు వెళ్లే సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.అటువంటి సమయంలో రోడ్డు మార్జిన్ వరకు సమీపంలో ఉన్న రొయ్యలు చేపల వ్యాపారులు దౌర్జన్యంగా రోడ్డు మార్చిని ఆక్రమించుకొని గోడలు నిర్మిస్తున్నారని ఇది దుర్మార్గమైన చర్యని మునుస్వామి అన్నారు .పంచాయతీ నుండి ఎటువంటి అనుమతి లేకుండా రోడ్డు మార్జిన్ ను ఆక్రమిస్తే 20 అడుగులు ఉన్న రోడ్డు గ్రామంలోనికి వాహనాలకు వెళ్ళడానికి సరిపోదని దీన్ని ఆక్రమించడానికి కుదరడన్నారు.దీనికి అధికారులు ఎటువంటి అనుమతులు ఇవ్వవద్దని డిమాండ్ చేశారు.ఈ రోడ్డు గుండా నిత్యం ప్రజలు వారి జీవన విధానానికి వెళ్లడానికి ఇదే మార్గమన్నారు. స్కూలుకు వెళ్లే పిల్లలు స్కూల్ బస్సులు,ఆటోలు,వృద్ధులు హాస్పటల్ కి వెళ్లాలన్న ఈరోడ్డే తప్ప వేరే మార్గం లేదని అటువంటి రోడ్డుకు మార్జిను లేకుండా గోడ నిర్మాణం చేస్తే ప్రజలు వాహనాలుతో వెళ్లడానికి ఇబ్బంది పడతారని ప్రమాదాలు జరుగుతాయని అన్నారు.మార్జిన్ పక్కన ఉన్న ఎన్నో సమస్యల నుంచి ఉన్న చెట్లను కూడా నరికి వేశారని ఇది చాలా విచారకరమైన చర్యని మునిస్వామి అన్నారు. వెంటనే అధికారులు దీన్ని సర్వే చేసి రోడ్డు మార్జిన్ ఆక్రమణ జరగకుండా ఆపాలని లేనిపక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజల సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తావని తెలియజేశారు.ఈమేరకు స్థానిక పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం గ్రామస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ జుత్తిగ రామాంజనేయులు,దంపన బోయిన కనికేశ్వరరావు, గడ్డం లక్ష్మణరావు,పెచ్చేటి స్వామి,దంపనబోయిన నాగేంద్ర,కేత సత్యనారాయణ,గడ్డం గంగరాజు,మల్లుల చిరంజీవి,దంపనబోయిన విజయలక్ష్మి,కొప్పిశెట్టి అరుణకుమారి,మల్లుల వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ దొరబాబు ఇరగవరం పశ్చిమగోదావరి జిల్లా,