మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధి ధ్యేయం.జిల్లా అదనపు కలెక్టర్ నగేష్
రామాయంపేట ; మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా శానిటేషన్ పై పటిష్ట ప్రణాళిక ద్వారా ముందుకు పోతూ
తడి చెత్త - పొడి చెత్త వేరు చేసి ప్రజలు అందించే విధంగా అవగాహన కల్పించాలని మున్సిపల్ కమిషనర్స్ ప్రజా జీవనంలో ప్రజలతో భాగస్వామ్యం కావాలి నగరాభివృద్ధి పనులలో వేగం పెంచాలి. పరిసర పరిశుభ్రతకు నిలయాలుగా మున్సిపాలిటీలు తయారు కావాలని
అదనపు కలెక్టర్ నగేష్ మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు.
కలెక్టరేట్ కార్యాలయంలో వీడియో సమావేశ మందిరంలో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల మున్సిపల్
మున్సిపల్ కమిషనర్స్ మున్సిపల్ సిబ్బందితో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల సమగ్రాభివృద్ధిపై సమీక్షించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ మున్సిపాలిటీలు ప్రగతి పథంలో నడవాలంటే కమిషనర్స్ ప్రణాళిక బద్ధంగా మున్సిపల్ సిబ్బంది సమగ్ర కార్య చరణతో ముందుకు నడుపుతూ శానిటేషన్ లో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారిస్తూ మన మన పట్టణం, మన ఇల్లు మన పరిసరాలు పరిశుభ్రతకు నిలయాలుగా మారే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు
ప్రాపర్టీ టాక్స్ వసూలు చేసే విషయంలో లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు పోవాలన్నారు నగరాభివృద్ధి పథకంలో భాగంగా ఎస్డిఎఫ్సి , అమృత్, ఎస్ బి ఎం ..మున్సిపల్ పెండింగ్ పనులు వేగం పెంచాలని,100 శాతం పన్నులు వసూలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.మెదక్ , నర్సాపూర్ రామాయంపేట తూప్రాన్ మున్సిపల్ పరిధిలో ఉన్న పెండింగ్ పనులు పూర్తి చేసి, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తను 4 రకాలు గా వేరు చేయాలని ,త్రాగునీటి సమస్య రాకుండా చూడాలని , వీది దీపాలు క్రమం తప్పకుండా వెలగాలని, పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో, రామాయంపేట మున్సిపల్ కమిషనర్ రవీందర్ తో పాటుమున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు
రమేష్ గౌడ్ రామాయంపేట మండల్ రిపోర్టర్….