BREAKING
ఘనంగా విద్యాసంస్థల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు నారాయణపేట డిసిసి అధ్యక్షులను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటానా? స్పందించిన ది రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ మోసాలకు కేంద్రం చెక్ :కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి! నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ ఆర్టీసీ ఎన్నికల్లో దూసుకుపోయిన బాణం నారాయణపేట డిపోలో కూటమికి మెజార్టీ రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జీర్ణక్రియ సజావుగా సాగేలా పాటించాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు హోప్ శతకం, రూథర్‌ఫోర్డ్ విధ్వంసం – 249 పరుగులు చేసినా భారత్‌కు తప్పని ఓటమి మానసిక ప్రశాంతత కోసం రోజువారీ జీవితంలో పాటించాల్సిన సులువైన మార్పులు ఇవే నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు!

మా లక్ష్యం వైద్యసేవలే.. రాజకీయాలు కాదు: మహేష్ డేగ్లోర్కర్

Select Suryaa Now
మా లక్ష్యం వైద్యసేవలే.. రాజకీయాలు కాదు: మహేష్ డేగ్లోర్కర్

 

సికింద్రాబాద్ మేజర్ న్యూస్ : తమ రాజకీయ ప్రయోజనాల కోసం మెడికవర్ ఆస్పత్రుల ప్రతిష్టను దిగజార్చడం సరికాదని ఆల్ ఇండియా మెడికవర్ ఆసుపత్రుల చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మహేష్ డేగ్లోర్కర్ అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ ఆసుపత్రికి ఈ రాజకీయ పార్టీతో నాయకులతో సంబంధం లేదని స్పష్టం చేశారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ కొంత మంది కావాలని ఆసుపత్రి ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రి ప్రారంభమై సంవత్సరం గడిచిందని, ఇప్పటివరకు 15 వేల ఇన్ పేషంట్లతో పాటు లక్షల మందికి ఓపి సేవలు అందించమన్నారు. రోగుల వ్యాధి తీవ్రత చికిత్సకు సంబంధించిన వివరాలు పరిశీలించకుండానే ఆసుపత్రిలో ఏడు మంది ఒకేరోజు చనిపోయారని ప్రచారం చేయడం సరికాదన్నారు వీరికి గ్లోబల్ ప్రచారంతో రోగులు వారి బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అలాంటి భయాలు సృష్టించవద్దన్నారు.   మా ఆసుపత్రుల ప్రారంభానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరో మంత్రి బండి సంజయ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఫడ్నవిస్ బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు , పోచారం శ్రీనివాస్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు వచ్చారన్నారు. తాము చేసేటివి వైద్యసేవలే తప్ప రాజకీయాలు కాదని గుర్తించాలని ఆయన కోరారు. భవిష్యత్తులో మరింత నాణ్యమైన వైద్య సేవలు ప్రజలకు అందేలా చూస్తామని తెలిపారు.