BREAKING
మత్తు పదార్థాల నిర్మూలన సమిష్టి బాధ్యత ఢిల్లీ, పశ్చిమ యూపీకి ఆరెంజ్ అలర్ట్‌.. భారీ వర్షాల హెచ్చరిక రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల పరిశీలన 20 ఎకరాల్లో రామగుండానికి ‘ఇందిరమ్మ టవర్స్‌’! సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై విమర్శలపై స్పందించిన వైఎస్‌ జగన్‌ పారదర్శకత, జవాబుదారీతనం ఈసీ ప్రాథమిక బాధ్యత: జగన్‌ మంత్రి సీతక్క సమీక్షా సమావేశానికి  పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి గోదావరి నీటిలో భారీ గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా అప్రమత్తంగా ఉండాలి సొసైటీ ద్వారా రైతులకు స్వల్ప కాలిక రుణాలు అందజేస్తాం ప్రేమ పేరుతో మైనర్ బాలికపై అఘాయిత్యం, పోక్సో చట్టం కింద కేసు నమోదు నూతన గ్రంథాలయ భవనానికి భూమిపూజ.. మహేష్ కుమార్ గౌడ్.. ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలి. నావికుల భద్రతపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆందోళన తాండూరులో గర్జించిన తీన్మార్ మల్లన్న ప్రజాస్వామ్య లోటును సృష్టించే కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు.. రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర విమర్శలు సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటలపై కాంగ్రెస్ నజర్.. ఇటావా, కన్నౌజ్, మైన్‌పురిలలో త్వరలో పర్యటన: అజయ్ రాయ్

కృత్రిమ మేధ, డిజిటల్ సాంకేతికతతో పర్యాటక రంగానికి కొత్త రూపు నేడు శిల్పారామంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం–2026 వేడుకలు హాజరుకానున్న సీఎం , డిప్యూటీ సీఎం, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

Select Suryaa Now
కృత్రిమ మేధ, డిజిటల్ సాంకేతికతతో పర్యాటక రంగానికి కొత్త రూపు  నేడు  శిల్పారామంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం–2026 వేడుకలు   హాజరుకానున్న సీఎం , డిప్యూటీ సీఎం, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు


తెలంగాణ బ్యూరో, ప్రతినిధి :  “డిజిటల్ అజెండా – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పర్యాటక రంగానికి కొత్త రూపు” అనే ఇతివృత్తంతో ప్రపంచ పర్యాటక దినోత్సవం–2026 వేడుకలను శనివారం (సెప్టెంబర్ 26) శిల్పారామంలోని సంప్రదాయ వేదికలో నిర్వహించనున్నారు. పర్యాటక రంగంలో డిజిటల్ సాంకేతికత, కృత్రిమ మేధ వినియోగం, భవిష్యత్ అవకాశాలపై ఈ సందర్భంగా చర్చలు జరగనున్నాయి.

ఉదయం 11 గంటలకు కార్యక్రమం 
ప్రారంభమవుతుంది. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రపంచ పర్యాటక దినోత్సవం–2026 ఇతివృత్తం ప్రాధాన్యతపై ప్రజెంటేషన్ నిర్వహిస్తారు. భాషా సాంస్కృతిక శాఖ, టీజీటీడీసీ , పురావస్తు శాఖ, నిథమ్ , సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీ, స్టేట్ ఆర్ట్ గ్యాలరీలు కార్యక్రమంలో భాగస్వామ్యం కానున్నాయి.

ఏ ఐ తో పర్యాటక రంగ భవిష్యత్తుపై చర్చ

“ఏ ఐ  అండ్ డిజిటల్ టెక్నాలజీ – ది ఫ్యూచర్ ఆఫ్ టూరిజం” అంశంపై తొలి ప్యానెల్ చర్చ నిర్వహించనున్నారు. అనంతరం విద్యార్థులతో ప్రశ్నోత్తర కార్యక్రమం ఉంటుంది. రెండో ప్యానెల్ చర్చలో ఎకో టూరిజం, ఫిల్మ్ టూరిజం, స్పోర్ట్స్ టూరిజం, హెరిటేజ్ టూరిజం తదితర రంగాల్లో వస్తున్న మార్పులు, అవకాశాలపై చర్చించనున్నారు.

ఈ సందర్భంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా , తెలంగాణ ప్రభుత్వ పురావస్తు 
శాఖ మధ్య అవగాహన ఒప్పందం  కుదరనుంది. అనంతరం ఎక్సలెన్స్ అవార్డులు, సర్టిఫికెట్ల ప్రదానం చేస్తారు.

పర్యాటక రంగంలో పలు డిజిటల్ కార్యక్రమాల ప్రారంభం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, తదితరుల సమక్షంలో తెలంగాణ పర్యాటక శాఖకు సంబంధించిన పలు కొత్త కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

వీటిలో * పునర్ ‌రూపకల్పన చేసిన తెలంగాణ టూరిజం వెబ్‌సైట్ , ఆన్‌లైన్ హోమ్‌స్టే రిజిస్ట్రేషన్ విధానం,  కొత్త టూరిజం ట్రైలర్లు,  ఇంటరాక్టివ్ ఏ ఆర్/వి ఆర్ ఆధారిత లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్,  తెలంగాణ పర్యాటక ప్రాంతాలపై కాఫీ టేబుల్ బుక్ 
“నా తెలంగాణ, నా కథ, నా గమ్యం” అంశంపై వీడియో/పోస్టర్  ఎకో టూరిజంపై వీడియో ను ఆవిష్కరించనున్నారు.

యువత భాగస్వామ్యానికి ప్రాధాన్యం

యువ టూరిజం క్లబ్‌ల విద్యార్థులు, టూరిస్ట్ పోలీస్, తెలంగాణ దర్శిని,   శిక్షణ పొందిన గైడ్స్ ,  హోమ్‌స్టే పై పలువురు తమ అనుభవాలను పంచుకోనున్నారు.