BREAKING
నేడు ఎంపిటీసి జెడ్పిటీసి ఎన్నికల నోటిఫికేషన్ అమలాపురంలో ఘనంగా ఆయుధ పూజ: సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించిన సబ్ కలెక్టర్ రాహుల్ మీనా ఐఏఎస్! పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు.. ప్రజలంతా ఆయురారోగ్యాలతో విలసిల్లాలి: డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ గాజులమండ్యం కూడలి వద్ద బోల్తాపడిన కాటన్ లారీ. లక్ష్మినారాయణపూర్‌లో విషాదం.. ఆర్మీ జవాన్ మల్లేశం మృతి ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు, 15 మందికి గాయాలు! తెలంగాణకు వర్ష గండం.. 2 రోజుల పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ! 19 సంవత్సరాల యువకుడి దారుణ హత్య మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌కు వైఎస్సార్‌సీపీ నేతల మద్దతు విజయం కోసం సమష్టిగా పనిచేస్తామని నాయకుల హామీ నారాయణ పేట జిల్లాలో నిలిచిపోయిన మిషన్ భగీరథ.. పల్లెల్లో తాగునీటి గోస! ఎన్నికల వ్యూహాలపై రమేష్ గౌడ్ ప్రత్యేక సమీక్ష మేయర్ ఎన్నికల్లో సహకరించాలి.. అన్ని వర్గాలకు పిలుపు నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యం: చిట్లూరు రమేష్ గౌడ్ సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కొక్కిరాల సురేఖమ్మ వీధి వ్యాపారులను స్మార్ట్ ఎంట్రప్రెన్యూర్లుగా మార్చేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్ వినూత్న ఆవిష్కరణ: ఫ్రాన్స్ అల్లర్లలో పెను విషాదం: రెండు ప్రపంచ యుద్ధాలను తట్టుకుని నిలిచిన 143 ఏళ్ల చారిత్రక టౌన్ హాల్‌కు నిప్పు.. కుప్పకూలిన బెల్ టవర్! నగరంపల్లి లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

కోటకొండలో సరస్వతి.. భైరంకొండలో లక్ష్మీదేవి -- శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి ప్రత్యేక అలంకరణలు

Select Suryaa Now
కోటకొండలో సరస్వతి.. భైరంకొండలో లక్ష్మీదేవి  -- శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి ప్రత్యేక అలంకరణలు

*నారాయణపేట, సూర్యన్యూస్:*    నారాయణపేట మండలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నారాయణపేట మండలం భైరంకొండతో పాటు సింగారం శ్రీగిరి పీఠంపై కొలువైన భవానీమాత అమ్మవారు ఏడవ రోజు శనివారం మహాలక్ష్మి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కోటకొండ వాసవీ కన్యక పరమేశ్వరి ఆలయంలో వాసవీ మాత  చదువుల తల్లి సరస్వతి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా  అమ్మవారికి  అభిషేకం, పుష్పాలంకరణ, మహామంగళహారతి తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించి హారతులు ఇచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు భక్తిశ్రద్దలతో అమ్మవారికి కుంకుమార్చన చేశారు. అలాగే భవానీమాత దీక్షలో ఉన్న భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట.