కొమరం భీమ్ విగ్రహావిష్కరణకు మంత్రి సీతక్కకు ఆహ్వానం
కొమరం భీమ్ విగ్రహావిష్కరణకు మంత్రి సీతక్కకు ఆహ్వానం.
దుమ్ముగూడెం సూర్య (మేజర్ న్యూస్)::
అక్టోబర్ 22న దుమ్ముగూడెం మండలంలోని ములకపాడు సెంటర్లో ఏర్పాటు చేసిన ఆదివాసి పోరాట యోధుడు కొమరం భీమ్ విగ్రహ ఆవిష్కరణకు రావాలని రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)ను ఆదివాసి సంఘాల ఐక్య కార్యాచరణ వేదిక సభ్యులు ఆహ్వానించారు.ములుగు జిల్లా తడ్వాయిలో శుక్రవారం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.మంత్రి రాక కోసం మండలంలోని ఆదివాసి మహిళలు, గిరిజన సంఘాల నాయకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వారు మంత్రికి వివరించారు.సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్క 22న జరిగే ఆవిష్కరణకు తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వేదిక వర్కింగ్ ప్రెసిడెంట్ కుంజా శ్రీనివాసరావు,సర్పంచులు పొడియం సుబ్బారావు, కుర్సం రవి,మాజీ ఎంపీటీసీ సోడే తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.