BREAKING
ఘనంగా విద్యాసంస్థల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు నారాయణపేట డిసిసి అధ్యక్షులను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటానా? స్పందించిన ది రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ మోసాలకు కేంద్రం చెక్ :కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి! నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ ఆర్టీసీ ఎన్నికల్లో దూసుకుపోయిన బాణం నారాయణపేట డిపోలో కూటమికి మెజార్టీ రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జీర్ణక్రియ సజావుగా సాగేలా పాటించాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు హోప్ శతకం, రూథర్‌ఫోర్డ్ విధ్వంసం – 249 పరుగులు చేసినా భారత్‌కు తప్పని ఓటమి మానసిక ప్రశాంతత కోసం రోజువారీ జీవితంలో పాటించాల్సిన సులువైన మార్పులు ఇవే నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు!

కాకతీయ టెక్నో హైస్కూల్‌లో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు

Select Suryaa Now
కాకతీయ టెక్నో హైస్కూల్‌లో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు

కాకతీయ టెక్నో హైస్కూల్‌లో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు

సంస్కృతి, సంప్రదాయాలను చిన్ననాటి నుంచే విద్యార్థులకు అలవర్చాలి: జగ్గు మల్లారెడ్డి

సిద్దిపేట అర్బన్  :సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాకతీయ టెక్నో హైస్కూల్‌లో ముందస్తు బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు.

ఉదయం నుంచే విద్యార్థులు, ఉపాధ్యాయులు తంగేడు, చామంతి, గులాబీ, గునుగు తదితర రంగురంగుల పూలతో అందమైన బతుకమ్మలను పేర్చి వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చారు. అనంతరం సంప్రదాయ బతుకమ్మ పాటలు, నృత్యాలు, కోలాటాలతో సందడి చేస్తూ ఆనందోత్సాహాల మధ్య వేడుకలను జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిద్దిపేట జిల్లా ప్రైవేట్ పాఠశాలల అధ్యక్షుడు జగ్గు మల్లారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర పండుగైన బతుకమ్మను ప్రతి ఒక్కరూ అత్యంత వైభవంగా జరుపుకోవాలని అన్నారు. విద్యార్థులకు చిన్ననాటి నుంచే మన సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతను తెలియజేస్తూ వాటిని గౌరవించేలా తీర్చిదిద్దాలని సూచించారు.అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు కోమటి చెరువు వద్దకు చేరుకుని బతుకమ్మ పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ వేడుకలను కొనసాగించారు. సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను నిమజ్జనం చేసి సంబరాలకు ముగింపు పలికారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కవిత, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.