BREAKING
ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గుండెను కాపాడుకుందాం.. ఆరోగ్యంగా జీవిద్దాం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి.. జిల్లా కలెక్టర్ అంకిత్ మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డికి వినతి పత్రం ప్రభుత్వ ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్‌లో ఏపీకి దేశంలోనే ప్రథమ స్థానం: సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు ప్రదానం ఉత్కంఠ భరితంగా విద్య కమిటీ ఎన్నికలు రూ.20 వేల కోట్లతో హార్టీకల్చర్ హబ్: వెలుగొండ ఆధారిత ప్రాంతాలకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యం గ్రామ, వార్డు సచివాలయ ఏఎన్ఎం ల సమస్యలపై గళం విప్పిన వైద్య ఉద్యోగుల సంఘ నేత ఆస్కార్ రావు ఐఎంఏ ఆధ్వర్యంలో 25వ రక్తదాన శిబిరం చంద్రబాబు నాయకత్వంలోనే వెలుగొండకు జలకళ: మంత్రి నిమ్మల రామానాయుడు కార్మికులపై పెరుగుతున్న పని ఒత్తిడి సమస్యల పరిష్కారం కోసం వినతి వెలుగొండతో ఉదయగిరి బత్తాయి తోటలకు జలకళ: ఈస్టర్న్ మెయిన్ కెనాల్ ద్వారా రైతులకు భరోసా ఇచ్చిన హామీలు అమలు చేసి సిరిసిల్లకు రావాలి, లేదంటే సీఎం పర్యటనను అడ్డుకుంటాం అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి మిషన్ కర్మయోగి రెండు రోజుల సదస్సు ప్రారంభం: ఉద్యోగుల్లో నైపుణ్యాల పెంపే లక్ష్యం

జాతీయ రహదారి విస్తరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

Select Suryaa Now
జాతీయ రహదారి విస్తరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

జాతీయ రహదారి విస్తరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే  పట్టణంలో భారీ స్వాగత తోరణం.. యూటర్న్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటుకు సూచనలు

పటాన్ చెరు; 

మదీనగూడ నుంచి రుద్రారం మీదుగా సంగారెడ్డి వరకు కొనసాగుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులను  పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మంగళవారం ఉదయం పరిశీలించారు. జాతీయ రహదారుల సంస్థ అధికారులతో కలిసి పటాన్చెరు పట్టణ పరిధిలో జరుగుతున్న పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

నియోజకవర్గ కేంద్రమైన పటాన్ చెరు పట్టణం ప్రత్యేకత, చారిత్రక ప్రాధాన్యత, అభివృద్ధి ప్రతిష్టను ప్రతిబింబించేలా అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ స్వాగత తోరణాన్ని నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. పట్టణంలోకి ప్రవేశించే వారికి ఆకర్షణీయంగా ఉండేలా స్వాగత తోరణం నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు.

అదేవిధంగా స్వాగత తోరణం సమీపంలో యూటర్న్ ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో స్థానిక ప్రజలు, వాహనదారులకు రాకపోకల్లో ఇబ్బందులు లేకుండా ఉంటాయని తెలిపారు. బస్టాండ్ ఎదురుగా ప్రయాణికుల రాకపోకలకు, స్థానిక వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు.

పనుల్లో జాప్యంపై అసంతృప్తి

జాతీయ రహదారి విస్తరణ పనులు ఆశించిన వేగంతో కొనసాగకపోవడంపై ఎమ్మెల్యే జిఎంఆర్ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. నిర్దేశించిన గడువులోగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు స్పష్టం చేశారు.

రహదారి విస్తరణతో పటాన్ చెరు పట్టణంలో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం లభించడంతో పాటు, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నిర్మాణ పనుల సమయంలో ప్రజలకు, వ్యాపారులకు కనీస ఇబ్బందులు కలగకుండా అవసరమైన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జాతీయ రహదారుల సంస్థ ఈఈ శ్రీనివాస్, డిఈ సందీప్, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు నర్రా బిక్షపతి, వెంకటేష్, కుమార్ గౌడ్, శివారెడ్డి, అశోక్, శంకర్, రాజు, రాజన్ సింగ్, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.