BREAKING
ఎల్‌పీజీ సిలిండర్‌కు నేటి నుంచి కేవైసీ తప్పనిసరి మర్పల్లి పీఏసీఎస్ పీఠంపై తీవ్ర ఉత్కంఠ నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై నిర్ణయాలు! రేపల్లెలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన మంచిర్యాలలో దారుణ హత్య.. నిందితురాలి అరెస్ట్ ఆసుపత్రి సేవలను పరిశీలించిన హెల్త్‌కేర్ విద్యార్థులు దృశ్యం 3 పై అజయ్ దేవగన్ కీలక ప్రకటన.. మోహన్‌‌లాల్‌తో చర్చల గురించి అసలు నిజం ఏమిటి? విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడమే గురువు అసలైన విజయం ఓటీటీలోకి కార్తీ సర్దార్ 2.. అనూహ్యంగా డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన స్పై థ్రిల్లర్ ఏటూరునాగారం ఐటీడీఏ ఏపీఓ తిరునగిరి రఘు పదవీ విరమణ సన్మాన సభ పెళ్లికి నో చెబుతున్న టాలీవుడ్ హీరోయిన్లు.. కారణం అదేనా? రజినీకాంత్ సెట్స్‌లో శ్రీలీల.. ఆ సినిమాలో స్పెషల్ రోల్ కోసమేనా కల్యాణ లక్ష్మి దరఖాస్తుల పెండింగ్‌పై మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆగ్రహం పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర! నల్లమల్ల అటవీ గ్రామాల పునరావాస ప్రక్రియ వేగవంతం, పంపిణీ

గిరిజన హక్కులపై న్యాయ విజ్ఞాన సదస్సు

Select Suryaa Now
గిరిజన హక్కులపై న్యాయ విజ్ఞాన సదస్సు

సూర్య తెలంగాణ డెస్క్: నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంలోని లచ్చిరాం తాండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గిరిజన హక్కులపై ప్రత్యేక న్యాయ విజ్ఞాన సదస్సు ఘనంగా నిర్వహించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ నాగర్ కర్నూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి డీఎల్ఎస్ఏ సెక్రెటరీ శ్రీమతి నిహారిక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. చట్టాలపై సరైన అవగాహన ఉండటం ద్వారా సమాజంలో నేరాలను అరికట్టవచ్చని ఆమె వెల్లడించారు. గిరిజనుల హక్కులు, వారికి రాజ్యాంగ పరంగా లభిస్తున్న రక్షణల గురించి అధికారులు సదస్సులో విస్తృతంగా అవగాహన కల్పించారు.

జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా ప్రజలకు అందుతున్న ఉచిత న్యాయ సేవల వివరాలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు. ఆర్థిక స్థోమత లేక న్యాయవాదిని నియమించుకోలేని పేదలకు ప్రభుత్వ ఖర్చుతోనే ఉచితంగా సమర్థుడైన న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. గిరిజనులు తమకు చట్టం కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకుని జీవితంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీరామ్ ఆర్యతో పాటు స్థానిక సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.