ఘనంగా పోషకాహార మాసోత్సవాలు
ఘనంగా పోషకాహారం మాసోత్సవాలు...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం అన్నపురెడ్డిపల్లి మండలంలో బుధవారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషకాహార మాసోత్సవాలు ఘనంగా జరిగాయి. ఎర్రగుంట సెక్టార్ లోని కంపగూడెం అంగన్వాడి కేంద్రం , అన్నపురెడ్డిపల్లి సెక్టార్ లోని పెంట్లం అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు, చిన్నారులకు అన్న ప్రసన్న, అక్షరాభ్యాసం కార్యక్రమాలు జరిపించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి (సిడిపిఓ) వి జ్యోతి పాల్గొని మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలు చిన్నారులు సమతుల్య ఆహారం ఆకుకూరలు, పప్పు ధాన్యాల, పాలు, గుడ్లు, పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలని, చిన్నపిల్లలకు మొదటి ఆరు నెలలు తల్లిపాలు తప్పనిసరిగా పట్టించాలని, ఇంటి ఆవరణం పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత పాటించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్ కారం శివ, వార్డు సభ్యులు మహాలక్ష్మి, అంగన్వాడి సూపర్వైజర్లు జి అరుణ, మహాలక్ష్మి, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
సూర్య ప్రతినిధి, అన్నపురెడ్డిపల్లి, చందు.