ఎంపీ మల్లు రవిని కలిసిన కాంగ్రెస్ నాయకులు
మహబూబ్నగర్ జిల్లాలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశానికి వెళ్తున్న నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవిని షాద్నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఎంపీ మల్లు రవితో ఆప్యాయంగా మాట్లాడారు.
నూతనంగా షాద్నగర్ నియోజకవర్గం ఎస్సీ సెల్ చైర్మన్గా ఎంపికైన జాంగారి రవిని స్థానిక నాయకులు ఎంపీ మల్లు రవికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మల్లు రవి సూచించినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ పి. రఘు నాయక్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇబ్రహీం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ టీ. కరణాకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాధేపల్లి సిద్ధార్థ, నియోజకవర్గ ఎస్సీ సెల్ చైర్మన్ జాంగారి రవి, కాంగ్రెస్ నాయకులు గడ్డం జంగయ్య, చెన్నగల్ల జంగయ్య, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు..
నరసింహ రెడ్డి, మేజర్ న్యూస్…