ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలి*సిపిఎం మండల కార్యదర్శి బండపల్లి బాలస్వామి
వంగూర్ సూర్య న్యూస్. ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి బండపల్లి బాలస్వామి కోరారు. ఆయన గురువారం రైతులతో కలిసి మండలంలోని సర్వారెడ్డిపల్లి తండాలో ఎండిపోయిన వరి పత్తి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు 12 గంటల కరెంటును అందించి ఆదుకోవాలని అన్నారు. రైతుల బ్యాంకు పంట రుణాలను మాఫీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బిచ్యా నాయక్ సభావత్ పూరి భాస్కర్ గోవింద్ లక్ష్మణ్ చిన్న బిచ్యా సభావత్ సత్యం తదితర రైతులు పాల్గొన్నారు.