BREAKING
హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంపై స్మృతి మంధాన ప్రశంసలు.. టీమిండియా భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు సింగరేణి ఏరియా వర్క్ షాప్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు *ఘనంగా PP9 ఛానెల్ 5వ వార్షికోత్సవం నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్.... ఇచ్చాపురంలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నూనెగింజల సాగుతో అధిక ఆదాయం... గిరిజన రైతులకు అవగాహన కార్యక్రమం పలమనేరు మున్సిపల్ ఎన్నికలు: తొలిరోజు 3 నామినేషన్లు భారత మహిళా క్రికెట్‌లో కొత్త శకం.. జింబాబ్వేతో సిరీస్‌తో కెప్టెన్‌గా స్మృతి మంధాన ప్రయాణం ప్రారంభం జలమయం అయిన రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం నందివాడలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డీఎస్పీ పాలా శ్రీనివాస్! శ్రీ కోటదుర్గమ్మ తిరువీధి ఉత్సవాన్ని విజయవంతం చెయ్యండి వైయస్సార్ పార్టీ 30 వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కె.వి. కృష్ణారెడ్డి నామినేషన్ *నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రత్యేక పూజలు* *సదాశివపేట వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూజలు* *అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే* దుర్గమ్మ మండపాలకు "నీలాపు" విరాళాలు నందివాడ ‘స్థానిక’ ఎన్నికల సమన్వయ కమిటీ ప్రకటన: 100% విజయమే లక్ష్యంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వ్యూహం! ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి చేయటం అమానుషం

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి - జిల్లా కలెక్టర్ రాజర్షి షా.

Select Suryaa Now
ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి - జిల్లా కలెక్టర్ రాజర్షి షా.
 సూర్య ఆదిలాబాద్ : రానున్న యాసంగి సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు.గురువారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై వ్యవసాయ, ఉద్యాన, నీటిపారుదల, భూగర్భ జలాలు, విద్యుత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వాతావరణ పరిస్థితుల్లో చోటుచేసుకునే మార్పులను ముందుగానే అంచనా వేసి, వాటికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించడం ద్వారా కరువు ప్రభావాన్ని గణనీయంగా తగ్గించవచ్చన్నారు. జిల్లాలో అందుబాటులో ఉన్న నీటి వనరులు, భూగర్భ జలాల పరిస్థితి, సాగు విస్తీర్ణం, వివిధ పంటలకు అవసరమయ్యే నీటి పరిమాణంపై సమగ్ర అంచనా రూపొందించాలని అధికారులను ఆదేశించారు.జిల్లాలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు, ఫామ్‌ పాండ్లు, బోర్లు, బావుల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి వనరుల వివరాలను క్షేత్రస్థాయిలో సేకరించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్న ప్రాంతాలను గుర్తించి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. వ్యవసాయ విద్యుత్ సరఫరాను క్రమబద్ధీకరించడంతో పాటు విద్యుత్ వృథాను అరికట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. మల్టీ కాంప్లెక్స్‌లు, ఫంక్షన్ హాళ్లు, షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంకులు తదితర సంస్థల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు..ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే ప్రతికూల పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి శాఖ తన పరిధిలో చేపట్టాల్సిన పనులను నిర్దేశిత కాలవ్యవధిలో పూర్తి చేసి, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగాన్ని సన్నద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీఆర్‌డీవో రవీందర్ రాథోడ్, సిపిఓ వెంకటరమణ, జిల్లా వ్యవసాయాధికారి రవీందర్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రామారావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సందీప్ కుమార్, విద్యుత్ శాఖ ఎస్ఈ సుభాష్, మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.