BREAKING
మూలపాడు వేదికగా ఆంధ్ర–కర్ణాటక రంజీ సమరం.. కఠోర సాధనలో ఇరు జట్లు ఘనంగా విద్యాసంస్థల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు నారాయణపేట డిసిసి అధ్యక్షులను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటానా? స్పందించిన ది రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ మోసాలకు కేంద్రం చెక్ :కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి! నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ ఆర్టీసీ ఎన్నికల్లో దూసుకుపోయిన బాణం నారాయణపేట డిపోలో కూటమికి మెజార్టీ రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జీర్ణక్రియ సజావుగా సాగేలా పాటించాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు హోప్ శతకం, రూథర్‌ఫోర్డ్ విధ్వంసం – 249 పరుగులు చేసినా భారత్‌కు తప్పని ఓటమి మానసిక ప్రశాంతత కోసం రోజువారీ జీవితంలో పాటించాల్సిన సులువైన మార్పులు ఇవే నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్

ఈ ప్రాంత అభివృద్ధికి ఎలాంటి నష్టం వాటిల్లదు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్డీవో మధు

Select Suryaa Now
ఈ ప్రాంత అభివృద్ధికి ఎలాంటి నష్టం వాటిల్లదు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్డీవో మధు

ఇల్లందు సూర్య ప్రతినిధి :

ఈ ప్రాంత అభివృద్ధికి నష్టం వాటిల్లదు 
- గ్రామసభలో ఆర్టీవో మధు 
ఇల్లందు రూరల్, సూర్య మేజర్ న్యూస్ : ఇల్లందు ప్రాంతా అభివృద్ధికి, హక్కుదారులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా నూతన ఓసి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్డీవో మధు స్పష్టం చేశారు. శుక్రవారం మండల పరిధిలోని సిఎస్పి బస్తి గ్రామపంచాయతీలో సింగరేణి జవహర్ అని ఉపరితల గని 2 లో భాగంగా నెలకొన్న భూ సమస్య పై పెస గ్రామసభ తీర్మానం ఆమోదం జరిగింది. గతంలో రెండుసార్లు గ్రామ సభలో నిరసన దారులతో వాయిదా పడింది. పంచాయతీ సర్పంచ్ లావణ్య అధ్యక్షతన జరిగిన పెస గ్రామసభ కు సింగరేణి ఇల్లందు ఏరియా జీయం వీసం కృష్ణ,  తాసిల్దార్ ఖాసీం పాషా, ఎంపీడీవో దన్ సింగ్, ఎఫ్ ఆర్ ఓ వెంకటేశ్వరరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ బొగ్గుకు పుట్టినిల్లు అయిన ఇల్లందు ప్రాంతం కనుమరుగు కాకుండా ఉండాలంటే నూతన ఏర్పాటు జరగాలన్నారు. నూతన ఓసి ఏర్పాటుతో మనుగడతో పాటు ప్రాంతంలోని యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి అన్నారు. గని ఏర్పాటుతో బొగ్గు ఉనికి కొనసాగుతూ వస్తుందన్నారు. హక్కుదారులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఓసి ఏర్పాటులో రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. ఎవరికి నష్టం వాటిల్లకుండా నూతన ఏర్పాటు కోసం సమిష్టిగా కృషి చేస్తూ ముందుకు సాగుతామన్నారు. అందరి సహాయ సహకారాలు ఉంటేనే ఇల్లందు మనుగడ కొనసాగిస్తుందన్నారు. అనంతరం ఏరియా జిఎం కృష్ణ మాట్లాడుతూ మూడోసారి నిర్వహించిన పెస గ్రామసభ విజయవంతమైందని అన్నారు. అటవీ శాఖకు సంబంధించి 168 హెక్టార్ల భూమిని అప్పగిస్తూ సభ తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఇల్లందు ఏరియాకు పూర్వ వైభవం తెచ్చేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నట్లు తెలిపారు. కాగా అన్ని అడ్డంకులు తొలగి నూతన ఓసి ప్రారంభానికి నోచుకోవడంతో స్థానికులు, ఇల్లందు పట్టణ పరిసర ప్రాంతాల వాసులు, నిరుద్యోగులు, యువత హర్షం వ్యక్తం చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిఎస్పి బస్తీ గ్రామపంచాయతీ సెక్రటరీ షర్మిల, ప్రజలు, సాగుదారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

ఇల్లందు సూర్య రూరల్ రిపోర్టర్ డానియల్