BREAKING
ఘనంగా విద్యాసంస్థల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు నారాయణపేట డిసిసి అధ్యక్షులను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటానా? స్పందించిన ది రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ మోసాలకు కేంద్రం చెక్ :కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి! నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ ఆర్టీసీ ఎన్నికల్లో దూసుకుపోయిన బాణం నారాయణపేట డిపోలో కూటమికి మెజార్టీ రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జీర్ణక్రియ సజావుగా సాగేలా పాటించాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు హోప్ శతకం, రూథర్‌ఫోర్డ్ విధ్వంసం – 249 పరుగులు చేసినా భారత్‌కు తప్పని ఓటమి మానసిక ప్రశాంతత కోసం రోజువారీ జీవితంలో పాటించాల్సిన సులువైన మార్పులు ఇవే నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు!

ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Select Suryaa Now
ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

-ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

సిద్దిపేట రూరల్, : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ప్రమీల, ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఫణిందర్ అన్నారు.శుక్రవారం బతుకమ్మ పండుగను పురస్కరించుకుని సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏబీవీపీ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రకృతిని పూజిస్తూ పూలతో పండుగ జరుపుకోవడం తెలంగాణ ప్రత్యేకత అని అన్నారు.మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని తెలిపారు. బతుకమ్మ ఆడుదాం.. మన సంస్కృతిని కాపాడుకుందాం అనే నినాదంతో యువతలో సాంస్కృతిక చైతన్యం పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వెల్లడించారు. పాశ్చాత్య సంస్కృతి ప్రభావానికి లోనుకాకుండా మన సంప్రదాయాలను గౌరవిస్తూ, వాటిని భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నగర కార్యదర్శి తప్పేట తరుణ్, జిల్లా సామాజిక మాధ్యమాల కన్వీనర్ తరుణ్ సాయి, నగర ఎస్‌ఎఫ్‌ఎస్ కన్వీనర్ శ్రీకాంత్, సాయి, కళాశాల విద్యార్థినులు, మహిళా అధ్యాపకులు, ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.