దుర్గామాత చండీ హోమంలో మేయర్ దంపతులు
సూర్య నస్పూర్ : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ రాంనగర్లో గల శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన చండీ హోమంలో మేయర్ దర్ని మధుకర్, ఆయన సతీమణి దర్ని సుజాత పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆయురారోగ్యాలతో ఉండి మరింత కాలం ప్రజలకు సేవలందించాలని, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, భవానీ యూత్ సభ్యులు, కాలనీవాసులు, భక్తులు పాల్గొన్నారు.