దొడ్డి దారిన కోర్టులో కేసు వేయించి మోసం చేశారు - ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
బిజినేపల్లి , సూర్య న్యూస్ : పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని అసెంబ్లీలో బిల్లు పెట్టారని, దొడ్డిదారిలో కోర్టులో కేసు వేయించి మోసం చేశారని ప్రభుత్వం పై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విమర్శలు చేశారు. బీసీ రాజ్యాధికార పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా గురువారం మండల కేంద్రంలో అంబేద్కర్, పూలే విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ .తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో బీసీల కోసం ఖర్చు చేసిన రెండు వేల కోట్లు కురుమూర్తి జాతరలోని బిచ్చగాళ్ళకి కూడా సరిపోవని అన్నారు. బీసీలకు 20 వేలా కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చి, అందులో ఖర్చు చేసిన మొత్తం రెండు వేలా కోట్లు కురుమూర్తి జాతరలో ఉండే బిచ్చగాళ్లకి కూడా సరిపోవన్నారు. కార్యక్రమంలో స్థానిక బహుజన నాయకులు మంగి విజయ్, అల్లోజీ, ఉర్కొండ రఘు, వెంకట స్వామి, సత్యశిలాసాగర్, ఇతర నాయకులు ఉన్నారు.