దసరా పండుగ కానుకగా పారిశుద్ధ్య కార్మికులకు చేయూత
మానవత్వానికి, సేవాభావానికి నిదర్శనంగా నిలిచిన సూరిశెట్టి బాలమ్మ – సిమ్మయ్య గుప్త కుటుంబం.
దసరా పండుగను పురస్కరించుకొని గట్టుప్పలపల్లి గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సూరిశెట్టి బాలమ్మ – సిమ్మయ్య గుప్త కుటుంబ సభ్యులు పండుగకు అవసరమైన నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. సుమారు రూ.10,000 విలువైన నిత్యవసర సరుకులను అందించి, గ్రామ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల్లో కూడా దసరా పండుగ సంతోషాలు వెల్లివిరియాలనే ఆశయంతో ఈ సహాయాన్ని అందించడం జరిగిందన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో గొప్పదని, ఎండనక, వాననక తమ విధులను నిర్వర్తిస్తూ గ్రామ పరిశుభ్రత కోసం నిరంతరం కృషి చేసే కార్మికులను గుర్తించి, పండుగ వేళ వారికి అండగా నిలవడం అభినందనీయమని గ్రామస్తులు తెలిపారు. పండుగ అంటే కేవలం మన కుటుంబంతో ఆనందంగా గడపడం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్నవారితోనూ ఆ ఆనందాన్ని పంచుకోవడమే నిజమైన పండుగ అనే సందేశాన్ని ఈ కుటుంబం చాటిచెప్పింది. ఈ కార్యక్రమంలో సూరిశెట్టి శ్రీనివాసులు గుప్త, సూరిశెట్టి సురేష్ గుప్తా, సూరిశెట్టి శశి గుప్తా, మాజీ సర్పంచ్ జయమ్మ వెంకటయ్య, మరియు అర్థం నరేందర్, విజయ, శేషియా నాయక్, జంగయ్య, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.