దసరా మామూళ్ల వేధింపులు తాళలేక డిప్యూటీ తహసీల్దార్ ఆత్మహత్య?
భద్రాచలం, అక్టోబర్ 18: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మేనేజర్ ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది.సూసైడ్ నోట్లో పలువురి పేర్లు.. డబ్బుల డిమాండ్, బెదిరింపులపై ఆరోపణలు భద్రాచలంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి వెలుగులోకి వచ్చినట్లు చెబుతున్న సూసైడ్ నోట్లో పలువురిపై సంచలన ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా తనపై ఒత్తిడి, వేధింపులు కొనసాగుతున్నాయని లక్ష్మీనారాయణ నోట్లో పేర్కొన్నట్లు సమాచారం.
దసరా మామూళ్ల పేరుతో డబ్బులు డిమాండ్?
సూసైడ్ నోట్లో దసరా మామూళ్ల పేరుతో డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. డబ్బులు ఇవ్వకపోతే తనపై వివిధ ఆరోపణలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని కొందరు బెదిరించినట్లు కూడా నోట్లో పేర్కొన్నట్లు సమాచారం.
అంతేకాకుండా తనపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు చేస్తున్నారని, ఈ వ్యవహారం కారణంగా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కూడా నోట్లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
సూసైడ్ నోట్లో పలువురి పేర్లు
లక్ష్మీనారాయణ తన మృతికి కొందరు వ్యక్తుల వేధింపులే కారణమంటూ వారి పేర్లను సూసైడ్ నోట్లో ప్రస్తావించినట్లు సమాచారం. ఇందులో కంప్యూటర్ ఆపరేటర్‌తో పాటు కొందరు మీడియా ప్రతినిధుల పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే నోట్లో చేసిన ఆరోపణలు నిజమా? వాటి వెనుక వాస్తవాలు ఏమిటి? అనే అంశాలను పోలీసులు దర్యాప్తులో తేల్చాల్సి ఉంది. నోట్లో పేర్కొన్న వ్యక్తులపై ఆరోపణలు మాత్రమే ఉన్నందున, వారి వివరణలు మరియు పోలీసుల దర్యాప్తు వివరాలు కీలకంగా మారాయి.
పోలీసుల దర్యాప్తు
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. లాడ్జిలో పరిస్థితులు, మృతుడి ఫోన్, సూసైడ్ నోట్, గతంలో చేసిన ఫిర్యాదులు, సంబంధిత వ్యక్తులతో జరిగిన సంభాషణలు తదితర అంశాలను పరిశీలించే అవకాశం ఉంది.
---
లేఖలోని టెక్స్ట్
నేను గత 7 నెలల నుండి ఆఫీసులో రజిత అనే డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు కంప్యూటర్ ఆపరేటర్ ఇబ్బందులకు తనకు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వాలని నన్ను వేధిస్తున్న ఇబ్బందులకు...
నేను 27.07.2026 నుండి 21 రోజులు [లీవ్/విధుల్లో] వెళ్ళటం జరిగింది. మరల నేను 17.08.2026 నాడు ఆఫీసులో నేను ఎన్నో విధాలుగా నా ట్రాన్స్ఫర్ కోసం జిల్లా అదనపు కలెక్టర్ గారిని మరియు మా జిల్లా మేనేజర్ గారిని ఎంత బ్రతిమాలినా కూడా నన్ను పాల్వంచ గ్యాస్ ఆఫీసు నుండి జిల్లా మేనేజర్ గారి ఆఫీసుకు ట్రాన్స్ఫర్ చేయలేదు.
పాల్వంచ గ్యాస్ ఆఫీసులో CC కెమెరాలు ఫిట్ చేయాలని నేను 2025 లో మా జిల్లా మేనేజర్ గారికి లెటర్ పెట్టటం జరిగింది. నన్ను 17.08.2026 జిల్లా ఆఫీసులో జాయిన్ అవ్వగా నన్ను పాల్వంచలోనే జాయిన్ అవ్వాలని జిల్లా మేనేజర్ గారు చెప్పగా నేను ఇక్కడ CC కెమెరాలు లేకుండా విధులు నిర్వహించడం కష్టంగా ఉందని చెప్పటం జరిగింది. జిల్లా మేనేజర్ గారు CC కెమెరాలు ఫిట్ చేయిస్తాను వెళ్లి జాయిన్ అవ్వమని చెప్పటం జరిగింది.
రజిత అనే కంప్యూటర్ ఆపరేటర్ నన్ను వినియోగదారుల వద్ద ఎందుకు ఎక్కువ డబ్బులు మీరు తీసుకోరు, మమ్మల్ని కూడా తీసుకోనివ్వరు. ఎలా సార్ కొత్తగూడెం గ్యాస్ ఏజెన్సీలో కలీమ్ కూడా ప్రతి దానికి ఎక్కువ డబ్బులు తీసుకోకుండా ఏ పని చేయడు. గ్యాస్ కూడా నల్ల బజారుకు తరలించి ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడు. నేను డెలివరీ ఆటో పెట్టుకుని డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వాలని నన్ను ఇబ్బంది పెడుతుంది.
28.10.2026 నాడు తన భర్త నాయని రాజేష్, మరియు నా [పేరు] అనే 10-TV రిపోర్టర్‌తో మరొక 6 గురిని పాల్వంచ గ్యాస్ ఆఫీసుకు తీసుకొచ్చి నన్ను నానా బూతులు తిట్టి చంపుతామని ఆఫీసు స్టాఫ్ మరియు డెలివరీ బాయ్స్ ముందు బెదిరించి వెళ్లారు.
రజిత కంప్యూటర్ ఆపరేటర్ sexual arrestment చేస్తున్నదని 30.09.2026 రోజున జిల్లా కలెక్టర్ గారికి కంప్లయింట్ కూడా చేశారు. నిన్న అనగా 16.10.2026 అంతర్గత ఫిర్యాదుల కమిటీ పాల్వంచ గ్యాస్ ఆఫీసులో పని చేస్తున్న వారిని విచారించడం జరిగింది.
ఇప్పుడు నన్ను సోషల్ మీడియా, వార్తా పత్రికలలో రజిత కంప్యూటర్ ఆపరేటర్‌ను sexual arrestment చేస్తున్నదని, రజిత భర్త నాయని రాజేష్, 10-TV రిపోర్టర్ నాగ చందు, కలీమ్ కొత్తగూడెం గ్యాస్ ఆఫీసులో పని చేస్తూ [లతను/లతను కూడా], రిపోర్టర్ కూడా... వీరందరూ నేను [వీరికి] పనిచేస్తున్నందుకు ఎవరికి అధిక డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వటం లేదని నా మీద [ఆరోపణలు/ప్రచారం] చేసి నన్ను మనస్తాపానికి గురి చేస్తున్నారు.
నేను చనిపోతే దానికి కారణం రజిత, నాయని రాజేష్, నాగచందు, కలీమ్, బిగ్ [వెంకన్న?], TV-9 రవి [మరియు ఇతరులు]…సూసైడ్ నోట్లోని ఆరోపణలపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడైతేనే ఘటనకు సంబంధించిన వాస్తవాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది.
Suryaa News Desk