BREAKING
మత్తు పదార్థాల నిర్మూలన సమిష్టి బాధ్యత ఢిల్లీ, పశ్చిమ యూపీకి ఆరెంజ్ అలర్ట్‌.. భారీ వర్షాల హెచ్చరిక రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల పరిశీలన 20 ఎకరాల్లో రామగుండానికి ‘ఇందిరమ్మ టవర్స్‌’! సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై విమర్శలపై స్పందించిన వైఎస్‌ జగన్‌ పారదర్శకత, జవాబుదారీతనం ఈసీ ప్రాథమిక బాధ్యత: జగన్‌ మంత్రి సీతక్క సమీక్షా సమావేశానికి  పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి గోదావరి నీటిలో భారీ గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా అప్రమత్తంగా ఉండాలి సొసైటీ ద్వారా రైతులకు స్వల్ప కాలిక రుణాలు అందజేస్తాం ప్రేమ పేరుతో మైనర్ బాలికపై అఘాయిత్యం, పోక్సో చట్టం కింద కేసు నమోదు నూతన గ్రంథాలయ భవనానికి భూమిపూజ.. మహేష్ కుమార్ గౌడ్.. ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలి. నావికుల భద్రతపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆందోళన తాండూరులో గర్జించిన తీన్మార్ మల్లన్న ప్రజాస్వామ్య లోటును సృష్టించే కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు.. రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర విమర్శలు సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటలపై కాంగ్రెస్ నజర్.. ఇటావా, కన్నౌజ్, మైన్‌పురిలలో త్వరలో పర్యటన: అజయ్ రాయ్

చిన్నారిపై అఘాయిత్యం, హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు.. పకడ్బందీ వాదనలు వినిపించిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రవీందర్‌కు డీసీపీ సన్మానం

Select Suryaa Now
చిన్నారిపై అఘాయిత్యం, హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు..    పకడ్బందీ వాదనలు వినిపించిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రవీందర్‌కు డీసీపీ సన్మానం

 సూర్య పెద్దపల్లి ప్రతినిధి 

 చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు పడేలా పకడ్బందీగా వాదనలు వినిపించిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ డొంకెన రవీందర్‌ సేవలు అభినందనీయమని పెద్దపల్లి డీసీపీ బి. రాంరెడ్డి అన్నారు. కేసు విచారణలో కీలకంగా వ్యవహరించి, న్యాయస్థానంలో సాక్ష్యాధారాలను సమర్థవంతంగా ప్రవేశపెట్టినందుకు రవీందర్‌ను శుక్రవారం సుల్తానాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో డీసీపీ ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ చిన్నారులపై జరిగే అత్యంత క్రూరమైన నేరాల్లో బాధితులకు సత్వర న్యాయం అందేలా పోలీసులతో పాటు ప్రాసిక్యూషన్‌ విభాగం కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రవీందర్‌ అంకితభావంతో, సమర్థవంతంగా వాదనలు వినిపించడం వల్లే నిందితుడికి న్యాయస్థానంలో కఠిన శిక్ష పడిందన్నారు. ఇలాంటి తీర్పులు చిన్నారులపై నేరాలకు పాల్పడే వారికి గట్టి హెచ్చరికగా నిలుస్తాయని పేర్కొన్నారు.నిందితులకు శిక్షలు పడేలా కేసులను సమర్థవంతంగా వాదించడంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రవీందర్‌ చేస్తున్న కృషిని డీసీపీ అభినందించారు. కార్యక్రమంలో ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐలు రంజిత్‌రావు, కొండపాక ప్రవీణ్‌కుమార్‌, ఎస్సైలు చంద్రకుమార్‌, అశోక్‌రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.